Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Gift: ఉద్యోగులకు కంపెనీ ఊహించని బహుమతి..! దీపావళి కానుకగా ఒక్కొక్కరికీ రూ.7లక్షల కారు గిఫ్ట్‌..!

తమ యజమాని ఇంత గొప్ప దాతృత్వానికి వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తమకు కారు నడపడం తెలియదని, ఇకపై కారు నడపడం నేర్చుకుంటామని మహిళా ఉద్యోగులు తెలిపారు. తమ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులతో ఆనందాన్ని పంచిందని, వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కారు వచ్చిన తన ఆనందాన్ని మాట చెప్పలేమంటున్నారు. తామంతా ఇకపై మరింత కష్టపడి కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తమని హామీ ఇచ్చారు.

Diwali Gift: ఉద్యోగులకు కంపెనీ ఊహించని బహుమతి..! దీపావళి కానుకగా ఒక్కొక్కరికీ రూ.7లక్షల కారు గిఫ్ట్‌..!
Diwali Gift
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2023 | 10:08 PM

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి కంపెనీ తమ ఉద్యోగులకు బహుమతులు అందజేస్తుంది. ఈ బహుమతులు స్వీట్ల నుండి గృహోపకరణాల వరకు ఉంటాయి. కానీ, ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులకు ఈసారి వెలుగుల పండుగ దీపావళి మరింత ప్రత్యేకంగా మారింది. పంచకులలోని ఓ ఫార్మా కంపెనీ యాజమాన్యం ఇచ్చిన దీపావళి కానుకతో తన ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. ఉద్యోగుల శ్రమకు, నిజాయితీ, నిబద్ధతకు ముగ్ధుడై దీపావళి కానుకగా వారికి 12 వాహనాలను బహుమతిగా ఇచ్చాడు. ఫార్మా కంపెనీ యజమాని తన 12 మంది ఉద్యోగులకు టాటా పంచ్ కారును బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఉద్యోగులు సైతం ఇదంతా నిజంగా సంతోషంగానూ ఉందంటూ ఆశ్చర్యంపోయారు. ఈ కంపెనీ తన 12 మంది బెస్ట్‌ ఎంప్లాయిస్‌కి వారి పనితీరుకు దీపావళి కానుకగా రూ.7 లక్షల విలువైన టాటా పంచ్ కారును ఇవ్వటంతో వారంతా పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కంపెనీ యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇళ్లు బహుమతిగా ఇచ్చిన ఘటనలు ఒక్క గుజరాత్‌లో మాత్రమే జరిగాయి. అయితే ఉత్తర భారతదేశంలోని ఇలాంటి ఘటన ఇదే మొదటిసారిగా తెలుస్తుంది. తమ వాహనాలతో పాటు కార్లను బహుమతిగా అందుకున్న ఉద్యోగుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంపెనీ యజమాని ఎం.కె.భాటియా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు చేసిన కృషి వల్లే ఈరోజు నేను గొప్ప స్థానానికి చేరుకున్నానని చెప్పారు. కొంతకాలం క్రితం నేను నా ఉద్యోగులకు కారు బహుమతిగా ఇస్తానని చెప్పాను. నేను నా వాగ్దానాన్ని నెరవేర్చాను. కారు సొంతం చేసుకోవాలనేది అందరి కల అన్నారు. అందుకే తన ఉద్యోగుల కలను నెరవేర్చానని చెప్పారు. తాను వాహనాలు ఇచ్చిన ఉద్యోగులు కంపెనీ ప్రారంభం నుంచి తపతో పాటు పగలు రాత్రి పనిచేసి ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించారని ప్రశంసించారు. అందుకే శ్రమకు తగిన ఫలితం ఏదైనా ఇవ్వాలని భావించినట్టుగా చెప్పారు.

ఇకపోతే, వారిలో చాలా మంది ఉద్యోగులకు కారు నడపడం కూడా తెలియని ఉద్యోగులు ఎందరో ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఉద్యోగులు కూడా కారును బహుమతిగా అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందంటున్నారు. తమ యజమాని ఇంత గొప్ప దాతృత్వానికి వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తమకు కారు నడపడం తెలియదని, ఇకపై కారు నడపడం నేర్చుకుంటామని మహిళా ఉద్యోగులు తెలిపారు. తమ కంపెనీ యాజమాన్యం ఉద్యోగులతో ఆనందాన్ని పంచిందని, వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కారు వచ్చిన తన ఆనందాన్ని మాట చెప్పలేమంటున్నారు. తామంతా ఇకపై మరింత కష్టపడి కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తమని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..