AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..లేదంటే ప్రాణాలకు ముప్పు పొంచిఉన్నట్టే..!

ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. అటువంటి సందర్భాలలో, వెంటనే చెక్‌ చేయించుకోవటం మంచిది. శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాల చర్మం రంగు మారిపోతుంది. ఇది పాదాలకు రక్త సరఫరాను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మీరు పాదాలపై స్పష్టంగా గమనిస్తారు. రక్తం లేకపోవడం వల్ల, రక్తం ద్వారా చేరే ఆక్సిజన్, పోషకాల సరఫరాలో అంతరాయం కారణంగా చర్మం, గోళ్ళ రంగు మారడం ప్రారంభిస్తుంది.

శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..లేదంటే ప్రాణాలకు ముప్పు పొంచిఉన్నట్టే..!
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2023 | 9:10 PM

Share

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు చాలా ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మనకు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. వాటిని పొరపాటున కూడా విస్మరించవద్దు. దానివల్ల మరిన్ని ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ లక్షణాలు కాళ్లలో కూడా కనిపిస్తాయి. సరైన సమయంలో పట్టించుకోకపోతే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మీరు గుండెపోటు ప్రమాదాన్ని కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. అధిక రక్తపోటుకు గురవుతారు. అంతే కాదు, ఇంకా అనేక రకాల వ్యాధులు ఎటాక్‌ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాళ్లపై కనిపించే లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పాదాలు చల్లబడటం కూడా అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు..

చలికాలంలో పాదాలు చల్లగా మారడం సర్వసాధారణం. అయితే మండే వేసవిలో కూడా మీ పాదాలు చల్లబడటం గమనిస్తే..వెంటనే మేల్కొండి. ఎందుకంటే అది ఏదో అనర్ధానికి మూలం కావొచ్చు. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. అటువంటి సందర్భాలలో, వెంటనే చెక్‌ చేయించుకోవటం మంచిది. శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాల చర్మం రంగు మారిపోతుంది. ఇది పాదాలకు రక్త సరఫరాను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మీరు పాదాలపై స్పష్టంగా గమనిస్తారు. రక్తం లేకపోవడం వల్ల, రక్తం ద్వారా చేరే ఆక్సిజన్, పోషకాల సరఫరాలో అంతరాయం కారణంగా చర్మం, గోళ్ళ రంగు మారడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాళ్ళ తిమ్మిర్లు..

రాత్రి నిద్రిపోతున్న సమయంలో కాళ్ళ నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది అధిక కొలెస్ట్రాల్ సాధారణ లక్షణం. అంటే మీ శరీరం కింది భాగంలోని నరాలు దెబ్బతిన్నాయి. పాదంతో పాటు చూపుడు వేలు, మడమ లేదా బొటనవేలులో తిమ్మిరి ఉంటే, అది మన నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది.

శరీర బరువు పెరుగుతున్నా కొద్దీ రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా పెరుగుతుంటాయి. దీంతో హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ ఎటాక్‌ చేస్తాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బెల్లీ ప్యాట్‌తో ఇబ్బంది పడేవారు.. వెంటనే దాన్ని కరిగించుకోవాలి. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!