AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra pradesh: నడిరోడ్డుపై గంజాయి ప్యాకెట్లు కలకలం..! రోడ్డు ప్రమాదంతో స్మగ్లింగ్ గుట్టురట్టు.. ట్విస్ట్‌ ఏంటంటే..

Anakapally District: ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ జిల్లాల నుంచి గంజాయి అక్రమ రవాణా యద్ధేచ్చగా సాగుతోంది. అధికారులు, సిబ్బంది ఎన్ని కఠిన చర్యలు, పటిష్ట నిఘా ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లర్లు అమాయకులను పావుగా వాడుకుని గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రజలను అడ్డంగా పెట్టుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడినప్పుడు అమాయకులు మాత్రమే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటివి గతంలో అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. సినిమాలు చూసి అక్రమార్కులు

Andhra pradesh: నడిరోడ్డుపై గంజాయి ప్యాకెట్లు కలకలం..! రోడ్డు ప్రమాదంతో స్మగ్లింగ్ గుట్టురట్టు.. ట్విస్ట్‌ ఏంటంటే..
Ganja Packets On Road
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 7:40 PM

Share

అనకాపల్లి జిల్లా, నవంబర్ 01; అది ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదానానికి కనెక్టింగ్ రహదారి. నిత్యం వందలాది వాహనాలు ఆ రూట్లో నుంచి ప్రయాణిస్తుంటాయి. అయితే.. ఆ రూట్లో ఒక్కసారిగా ప్యాకెట్లు కనిపించాయి..! చూస్తే అదోలా ఉన్నాయి. నిజమే.. ఆ ప్యాకెట్లను చూసిన వాళ్లకు కలిగిన అనుమానం నిజమే..! కొన్ని క్షణాల ముందే.. ఓవైపు అతివేగంగా కారణుడి కొట్టి వెళ్ళిపోయింది. ఆ వైట్ నుంచి పడినవే ఆ ప్యాకెట్లు..! మరి ఆ ప్యాకెట్లలో ఉన్నావేంటి..? ఎందుకు మళ్ళీ పారిపోయారు..?! ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు మర్మం ఇదే..!

– అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి బయటపడింది. నర్సీపట్నం – తుని రోడ్ బలిఘట్టం వద్ద బైక్, కారు డీ కొన్నాయి. బైక్ నుండి వస్త్రాల మాటున దాచిన ఒక్కసారిగా జారిపడ్డయి ప్యాకెట్లు. చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఆ ప్యాకెట్లను పారిపోయారు బైక్ పై వెళ్తున్న వాళ్ళు. అటుగా వెళ్తున్న వారికి ఆ ప్యాకెట్లను చూసి అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి ప్యాకెట్లుగా గుర్తించారు. మరి ఆ ప్యాకెట్లను తీసుకెళ్తున్నది ఎవరు..? దీన్నే ట్రాక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నరు. ఆ బైక్ గుర్తించగలిగితే.. ఆ నిందితులు చిక్కినట్లే..!

– మొత్తం మీద వస్త్రాల మాటున గుట్టుగా తరలిపోతున్న గంజాయి.. యాక్సిడెంట్ తో బయటపడింది. ఈ ఘటనతో అటుగా వెళ్లే వాహనాలపై మరింత నిఘా పెంచారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అడ్డదారులు పడుతున్నారు. అధికారుల కళ్లు గప్పి అక్రమ మార్గాల్లో గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తూ అడ్డంగా పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ జిల్లాల నుంచి గంజాయి అక్రమ రవాణా యద్ధేచ్చగా సాగుతోంది. అధికారులు, సిబ్బంది ఎన్ని కఠిన చర్యలు, పటిష్ట నిఘా ఏర్పాటు చేసినప్పటికీ స్మగ్లర్లు అమాయకులను పావుగా వాడుకుని గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రజలను అడ్డంగా పెట్టుకుని కోట్లు కూడబెట్టుకుంటున్నారు. పోలీసులకు పట్టుబడినప్పుడు అమాయకులు మాత్రమే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటివి గతంలో అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. సినిమాలు చూసి అక్రమార్కులు ఇన్ స్పైయర్ అవుతున్నారో లేదంటే.. స్మగ్లర్లను చూసి సినిమాఆలు తీస్తున్నారో తెలియదు గానీ, సినిమా స్టైల్లో జరుగుతున్న అక్రమ రవాణా, స్మగ్లింగ్ కేసులు మాత్రం పోలీసులతో పాటు సామాన్య ప్రజల్ని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?