Telangana: వామ్మో.. ఏం స్కెచ్‌ వేశాడు..! రూ.21 కోట్ల రూపాయల నేరానికి పాల్పడ్డ కూరగాయల వ్యాపారి.. ఖాకీలే కంగుతినేలా..

Hyderabad: రిషబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు చేసిన నేరాల గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు.. ఒక కూరగాయల వ్యాపారిగా ఉన్న రిషబ్ కోట్ల రూపాయల స్కాంకి పాల్పడటం వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇతర దేశాలలో ఉన్న సైబర్ క్రిమినల్స్ రిషబ్ ను అడ్డం పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ల ద్వారా డబ్బును దేశాలు దాటిస్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇతర దేశాల్లో ఉన్న నిర్వాహకులు తమ వ్యాపారాన్ని భారత్ లో

Telangana: వామ్మో.. ఏం స్కెచ్‌ వేశాడు..! రూ.21 కోట్ల రూపాయల నేరానికి పాల్పడ్డ కూరగాయల వ్యాపారి.. ఖాకీలే కంగుతినేలా..
Vegetable
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 03, 2023 | 8:15 PM

కూరగాయలు అమ్ముకునే వ్యాపారిపై దేశవ్యాప్తంగా 37 కేసులు నమోదయ్యాయి.. 10 రాష్ట్రాల్లో ఈ కూరగాయల వ్యాపారిపై 21 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి.. అక్టోబర్ 28న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫరీదాబాద్ లో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న రిషబ్… కోవిడ్ కారణం తన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది.. నష్టాలనుండి కోలుకోవాలని భావించిన రిషబ్ సైబర్ క్రైమ్ ను ఆసరాగా చేసుకొని సంపాదించడం మొదలుపెట్టాడు. ఆరు నెలల వ్యవధిలోని 21 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎట్టకేలకు పది రాష్ట్రాల పోలీసులు అతని వెంట పడటంతో ఖాకీలకు అడ్డంగా దొరికిపోయాడు.

తన కుటుంబాన్ని ఆదుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఎందులోనూ స్థిరంగా ఉండలేకపోయాడు. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆన్లైన్ స్కామ్ ల గురించి తెలుసుకున్నాడు. అతనికి తెలిసిన పాత మిత్రుడి ద్వారా ఆన్లైన్ నేరాలను ఎలా చేయాలో తెలుసుకున్నాడు. తన స్నేహితుడి నుండి కొన్ని ఫోన్ నెంబర్లను సేకరించి కాల్స్ చేయడం ప్రారంభించాడు. చిన్న పనికి పెద్ద ఉద్యోగం కల్పిస్తానంటూ నమ్మించి ఒక్కో బాధితుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడు.. డెహ్రా డూన్ కి చెందిన ఒక బడా బిజినెస్ మెన్ నుండి  రూ.20 లక్షల వరకు కాజేశాడు. ఒక హోటల్ గ్రూప్ కి సంబంధించిన వెబ్సైట్ ను క్రియేట్ చేసి దానికి రివ్యూస్ రాయాల్సిందిగా ఆయా ఫోన్ నెంబర్లకు కాల్ చేసేవాడు. అలా రివ్యూస్ రాసిన వారికి 10000 రూపాయలు మొదట్లో చెల్లించాడు.

దీనికోసం ఒక నకిలీ టెలిగ్రామ్ గ్రూప్ ని సైతం హోటల్ పేరుతో నడిపించాడు. హోటల్ కి సంబంధించిన పాజిటివ్ రివ్యూస్ ఇవ్వాల్సిందిగా బాధితులకు టాస్క్ ఇచ్చాడు. కొంతమంది నకిలీ గెస్ట్ లతో నూ ఫేక్ రివ్యూ ఇపించాడు.. అలా ఒక్కో రివ్యూ కి పదివేల రూపాయలు చెల్లించిన తర్వాత రిషబ్ పై పూర్తి నమ్మకం ఏర్పడేలా బాధితులను నమ్మించాడు. ఆ తర్వాత మరో టాస్క్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని బాదితులను నమ్మించాడు.. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం అంటూ ఆశ చూపాడు. కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చిన వెంటనే బాధితులకు స్పందించడం ఆపేశాడు. తన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికీ కనిపించకుండా పారి పోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

రిషబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు చేసిన నేరాల గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు.. ఒక కూరగాయల వ్యాపారిగా ఉన్న రిషబ్ కోట్ల రూపాయల స్కాంకి పాల్పడటం వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇతర దేశాలలో ఉన్న సైబర్ క్రిమినల్స్ రిషబ్ ను అడ్డం పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ల ద్వారా డబ్బును దేశాలు దాటిస్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇతర దేశాల్లో ఉన్న నిర్వాహకులు తమ వ్యాపారాన్ని భారత్ లో విస్తరించేందుకు రిషబ్ లాంటివారిని పావుగా ఉపయోగించుకుంటున్నట్టు దర్యాప్తు సంస్థల విచారణలో బయటపడింది.. చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న నిర్వాహకులకు రిషబ్ కథనుండి కోట్ల రూపాయల నిధులు వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్బీఐ వెబ్‌ సిరీస్‌..90 ఏళ్ల చరిత్రను కేవలం 3 గంటల్లోనే చూడవచ్చు
ఆర్బీఐ వెబ్‌ సిరీస్‌..90 ఏళ్ల చరిత్రను కేవలం 3 గంటల్లోనే చూడవచ్చు
ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తప్పుకోనున్న ఆల్ రౌండర్
ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తప్పుకోనున్న ఆల్ రౌండర్
సాటి పక్షి ప్రాణాల కోసం ఊరపిచ్చుక తహతహ .. ఈ బుద్ధి మనషిలో లేకపోయే
సాటి పక్షి ప్రాణాల కోసం ఊరపిచ్చుక తహతహ .. ఈ బుద్ధి మనషిలో లేకపోయే
పురుషుల్లో ఆ సమస్యకు కారణమవుతోన్న పెర్‌ఫ్యూమ్స్‌..
పురుషుల్లో ఆ సమస్యకు కారణమవుతోన్న పెర్‌ఫ్యూమ్స్‌..
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
రియల్‌ లైఫ్‌లో జాన్వీ చాలా సెన్సిటివ్‌. కానీ.. రివీల్ చేసిన ఉలజ్‌
రియల్‌ లైఫ్‌లో జాన్వీ చాలా సెన్సిటివ్‌. కానీ.. రివీల్ చేసిన ఉలజ్‌
ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ఆగస్టు 31కి పొడిగించారా?
ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు ఆగస్టు 31కి పొడిగించారా?
శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువైనా నష్టమే.. ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు.
శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువైనా నష్టమే.. ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు.
వీళ్లు తండ్రులు కాదు.. నీచులు.. హైదరాబాద్ నగరంలో దారుణాలు..
వీళ్లు తండ్రులు కాదు.. నీచులు.. హైదరాబాద్ నగరంలో దారుణాలు..
వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. పూర్తి షెడ్యూల్
వన్డే సిరీస్‌కు సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​