హెయిర్ ఫాల్‌కు పర్మనెంట్ సొల్యూషన్‌ కొబ్బరి పాల రెమెడీ.. ఇలా వాడితే శాశ్వతంగా పుల్‌స్టాప్‌ పడినట్టే..!

నెరిసిన జుట్టు సమస్యకు కూడా కొబ్బరి పాలు అప్లై చేయటం వల్ల మేలు జరుగుతుంది. కొబ్బరి పాలను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టించాలి. ఉదయం తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె, కొబ్బరి పాలు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నెరవడం ఆగిపోతుంది. అంతేకాకుండా, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఈ 4 మార్గాల్లో కొబ్బరి పాలను ఉపయోగించి ప్రయత్నించండి.

హెయిర్ ఫాల్‌కు పర్మనెంట్ సొల్యూషన్‌ కొబ్బరి పాల రెమెడీ.. ఇలా వాడితే శాశ్వతంగా పుల్‌స్టాప్‌ పడినట్టే..!
Hair fall permanent solution
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2023 | 9:26 PM

ఇటీవలి కాలంలో జుట్టు రాలడం, వెంట్రుల రంగు నెరిసిపోవటం చాలా మందిలో సాధారణ సమస్యగా మారిపోయింది. దీంతో ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. కానీ జుట్టు రాలడం అనే సమస్య అకస్మాత్తుగా తలెత్తదు. చాలా సార్లు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు వేగంగా రాలిపోతుంది.అయితే, కొన్ని హోం రెమెడీస్ హెయిర్ ఫాల్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. జుట్టు రాలడం సమస్యను అధిగమించడానికి, రెగ్యులర్ కేర్ అవసరం. జుట్టు రాలే సమస్యను అధిగమించటానికి కొబ్బరి నూనె ఉత్తమమైనదిగా చెబుతారు. అయితే మీరు ఎప్పుడైనా మీ జుట్టుకు కొబ్బరి పాలను ఉపయోగించారా? జుట్టు రాలడాన్ని నిరోధించడానికి కొబ్బరి పాల రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి పాలతో హెయిర్ మసాజ్, షాంపూ తర్వాత కొబ్బరి పాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాకుండా, జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఈ 4 మార్గాల్లో కొబ్బరి పాలను ఉపయోగించి ప్రయత్నించండి.

కొబ్బరి పాలను సాధారణంగా ఆహారంలో ఉపయోగిస్తారు. కొబ్బరి పాలు సహజమైన మాయిశ్చరైజర్. బలహీనమైన జుట్టుకు అవసరమైన పోషణను అందించడానికి కొబ్బరి పాలను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొడిబారడం, చివర్లు చీలిపోవడం, చుండ్రు సమస్య నుంచి బయటపడేందుకు కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయి. జుట్టుకు కొబ్బరి పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

మీ జుట్టు వేగంగా రాలిపోతుంటే, కొబ్బరి పాలలో కొంచెం కర్పూరాన్ని కలిపి పేస్ట్ లా చేయండి. ఈ కొబ్బరి పాలు, కర్పూరం పేస్ట్ ను హెయిర్ ఆయిల్ లాగా తలకు బాగా అప్లై చేయండి. జుట్టు మూలాలకు అప్లై చేసిన తర్వాత, కాసేపు మసాజ్ చేయండి. 1 నుండి 2 గంటల తర్వాత తేలికపాటి, నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

జుట్టు బాగా పొడిగా ఉంటే, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండీషనర్‌కు బదులుగా కొబ్బరి పాలను అప్లై చేయండి. జుట్టు పొడిగా మారినప్పుడు జుట్టు రాలే సమస్య వస్తుంది. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కొబ్బరి పాలను అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా పోయి మెరుపు పుంజుకుంటుంది.

కొబ్బరి పాలను మీ జుట్టుకు కనీసం వారానికి రెండు సార్లు రాయండి. కొబ్బరి పాలను జుట్టుకు పట్టించి తేలికగా మసాజ్ చేయండి. కొబ్బరి పాలను మీ జుట్టుకు పట్టించి 1 గంట పాటు అలాగే ఉంచండి. అప్పుడు షాంపూ చేయటం మంచిది.

నెరిసిన జుట్టు సమస్యకు కూడా కొబ్బరి పాలు అప్లై చేయటం వల్ల మేలు జరుగుతుంది. కొబ్బరి పాలను కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టించాలి. ఉదయం తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనె, కొబ్బరి పాలు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నెరవడం ఆగిపోతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..