నటుడిగా రాణిద్దామని కలలు కన్నాడు.. ప్రయాణాన్ని అర్థాంతరంగా ముగించాడు
సినిమాల్లో రాణించాలంటే నటన గురించి తెలియాలి? సినిమా తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి? కోట్లు ఖర్చుపెట్టే స్తోమత లేదు కాబట్టి తన టాలెంట్ ని అయినా ప్రపంచానికి తెలియజేయాలి. అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది అని డిసైడ్ అయ్యాడు. తనకున్న టాలెంట్ తో, కొద్దిపాటి డబ్బు పెట్టుబడిగా పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో రాణించాలనుకున్నాడు.
ఏదో ఒక రోజు మంచి సినిమా తీయాలి.. మంచి హీరోని కావాలి.. అది ఆ యువకుడి కల.. అందుకోసం నిరంతరం ఆలోచించేవాడు, గ్లామర్ పెంచుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు.. సినిమాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే సినిమాల్లో రాణించగలం? అని నిత్యం స్నేహితులతో చర్చిస్తుండేవాడు. అంతే కాదు గూగుల్, యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరీ చూసేవాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సినిమాల్లో రాణించాలంటే నటన గురించి తెలియాలి? సినిమా తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి? కోట్లు ఖర్చుపెట్టే స్తోమత లేదు కాబట్టి తన టాలెంట్ ని అయినా ప్రపంచానికి తెలియజేయాలి. అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది అని డిసైడ్ అయ్యాడు. తనకున్న టాలెంట్ తో, కొద్దిపాటి డబ్బు పెట్టుబడిగా పెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో రాణించాలనుకున్నాడు. తన టాలెంట్‌ను ఫైనాన్షియర్స్‌కి చూపించి సినీ రంగ ప్రవేశం చేద్దామని అనుకున్నాడు. అందుకోసం స్నేహితుల దగ్గర అప్పులు కూడా చేశాడు. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు. అయితే అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ అంతగా రాణించలేదు. అలా తలకు మించిన భారంతో షార్ట్ ఫిల్మ్స్ తీయడంతో అప్పులు కూడా పెరిగాయి.
దీంతో అప్పులు ఇచ్చిన వారి నుండి ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయి. అయినా తన పద్దతి మార్చుకోలేదు, ఎలాగైనా మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి అందులో రాణించి సినీ రంగ ప్రవేశం చేయాలని తపన పడ్డాడు.. ఈ క్రమంలోనే మరొక షార్ట్ ఫిలిం తీసేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం తను తల్లిని యాభై వేలు అప్పుగా అడిగాడు. అయితే తన తల్లికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఆమె ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా చిన్న ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఆర్థికంగా తన పరిస్థితి సరిగా లేకపోవడంతో కొడుకు అడిగిన యాబై వేలు ఇవ్వలేక పోయింది.
దీంతో మనస్థాపం చెందిన యువకుడు తన ఆశ నెరవడం లేదని నిర్ణయించుకొని ఇంట్లో తాను పడుకున్న పడక గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలోకి వెళ్ళిన కొడుకు ఎంత సేపు తలుపులు కొట్టిన తీయకపోవడంతో స్థానికులు సహాయంతో తలుపులు తెరిచి చూసే సరికే కుమారుడు మృతి చెంది కనిపించాడు. చేతికి అందిన కుమారుడు మృతి చెందటం చూసి తల్లి గుండెలవిసెలా రోధిస్తుంది ఆ తల్లి. ఆమెను చూసిన స్థానికులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం మణికంఠ కాలనీలో జరిగిన దుప్పలపూడి సునీల్ అనే ఇరవై ఒక్క ఏళ్ల యువకుడి ఆత్మహత్య ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..