Tirupati: పురాతన మండపాల వివాదం..టీటీడీ నిర్ణయాన్ని తప్పు పట్టిన బీజేపీ…..చర్చపై సవాళ్లు, విమర్శలు..

Andhra Pradesh: టిటిడి పరిధిలో కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలు ఉన్నాయని, రాజులు, చక్రవర్తులు నిర్మించిన ప్రాచీన కట్టడాలు కనుమరుగు అవుతున్నాయన్నారు. పురావస్తు శాఖ సలహాలు తీసుకొని కట్టడాల పునర్ నిర్మాణం చేయాలన్నారు. 100 ఏళ్లకు పైబడిన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని తిరుమల పార్వేట మండపం సందర్శనకు రావాలన్న ఈవో ధర్మారెడ్డి ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నామన్నారు. ఎప్పుడు చర్చకు రావాలో ఈవో ధర్మారెడ్డి నిర్ణయించి సమయం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి.

Tirupati: పురాతన మండపాల వివాదం..టీటీడీ నిర్ణయాన్ని తప్పు పట్టిన బీజేపీ.....చర్చపై సవాళ్లు, విమర్శలు..
Ttd Eo
Follow us
Raju M P R

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 04, 2023 | 8:06 PM

పురాతన మండపాల పునర్నిర్మాణంపై టిటిడి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న బీజేపీ విమర్శలకు దిగడంతో టిటిడి సీరియస్ గా రెస్పాండ్ అయింది. దీంతో టిటిడి, బిజెపిల మధ్య విమర్శలు, సవాళ్లకు కారణమైంది. తిరుమలలోని పార్వేటి మండపం, అలిపిరి లోని పాదాల మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతులకు వీలు లేక కూల్చివేసి పునర్నిర్మాణ పనులను టిటిడి చేపట్టింది. పురాతన మండపాల తొలగింపు భక్తుల మనోభావాలకు సంబంధించిందని ప్రశ్నిస్తున్న బిజెపి పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తుంది. బిజెపి వాదనను తప్పుపడుతున్న టిటిడి బహిరంగ చర్చకు డిమాండ్ చేస్తోంది.

టిటిడికి చెందిన పురాతన మండపాలను తొలగించాలని టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయం అమలులో వివాదాస్పదంగా మారుతుంది. తిరుమలలోని అతి పురాతన పార్వేటి మండపాన్ని గత జులై 4 న కూల్చి వేసిన టిటిడి.. ఇప్పుడు అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న 16 వ శతాబ్దం నాటి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్ నిర్మాణం చేపట్టబోతోంది. 4 నెలల క్రితం శతాబ్దాల చరిత్ర కలిగిన పార్వేటి మండపాన్ని కూల్చి వేసిన టిటిడి… తిరిగి అదే చోట కొత్తగా అత్యాధునాతన హంగులతో టీటీడీ మండపాన్ని నిర్మించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం రోడ్డులో ఉన్న పార్వేటి మండపం ఎంతో పురాతనమైన మండపం. కాగా శిధిలావస్థకు చేరుకోవడంతో ఈ మండపం స్థానంలో కొత్తగా మండపాన్ని నిర్మించాలని నిర్ణయించిన టిటిడి ఈ మేరకు పాత మండపాన్ని తొలగించి, నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ మధ్యనే ఉత్సవాన్ని నిర్వహించింది. ఏటా శ్రీవారికి పార్వేటి మండపంలో స్నపన తిరుమంజనం కార్యక్రమంతో పాటు పార్వేటి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా, పార్వేటి ఉత్సవంలో భాగంగా స్వామి వారు ఇక్కడ వేటకి వెళతారు.

మరోవైపు కార్తీక మాసంలో కూడా పార్వేటి మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి స్నప్న తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా టిటిడి నిర్వహిస్తుంది. కొన్ని వందల ఏళ్ళ నాటి నుంచి పార్వేటి మండపంలో కనుమ పండుగ నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన మండపం కావడంతో కొంత శిధిలం కావడం, మండపం ఇరుకుగా ఉండటంతో స్నపన తిరుమంజనం నిర్వహించే సమయంలో అర్చకులకు ఇబ్బందిగా మారడాన్ని గుర్తించిన టిటిడి ఈ మేరకు పునర్ నిర్మాణ నిర్ణయం తీసుకుంది. పార్వేటి మండపాన్ని 2 నెలల వ్యవధిలోనే నిర్మించింది. పార్వేటి మండపం నిర్మాణం కోసం తమిళనాడులోని తిరుచినాపల్లి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్తంభాలను వినియోగించి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్త మండపాన్ని నిర్మించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు శిథిలావస్థకు చేరుకున్న అలిపిరి పాదాల మండపం పునర్ నిర్మించాలని భావించిన టిటిడి ఈ మేరకు పనులు ప్రారంభించింది. 16 వ శతాబ్దం నాటి అలిపిరి పాదాల మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతులకు వీలులేక పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు టిటిడి ఇఓ ధర్మారెడ్డి పరిశీలించి ప్రకటించారు. ఇక, పురాతన మండపాల కూల్చివేతను తప్పుపడుతున్న బిజెపి పురావస్తు శాఖ అనుమతి లేకుండా చారిత్రక కట్టడాలను కూల్చడాన్ని తప్పుపడుతోంది. మూడురోజుల క్రితం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించి టిటిడి నిర్ణయాలను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి తప్పు పట్టారు. బిజెపి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న టిటిడి బిజెపి నేత భానుప్రకాష్ చర్చకు రావాలని సవాల్ విసిరింది.

టిటిడి మండపాల పునర్నిర్మాణ వివాదంపై టిటిడి ఇఓ సవాల్ ను బిజెపి నేతలు స్వీకరించారు. ఈఓ ధర్మారెడ్డి కామెంట్స్ పై తిరుమలలో స్పందించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ప్రాచీన, పురాతన కట్టడాలు భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టిటిడి పరిధిలో కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలు ఉన్నాయని, రాజులు, చక్రవర్తులు నిర్మించిన ప్రాచీన కట్టడాలు కనుమరుగు అవుతున్నాయన్నారు. పురావస్తు శాఖ సలహాలు తీసుకొని కట్టడాల పునర్ నిర్మాణం చేయాలన్నారు. 100 ఏళ్లకు పైబడిన కట్టడాలు పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయని తిరుమల పార్వేట మండపం సందర్శనకు రావాలన్న ఈవో ధర్మారెడ్డి ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నామన్నారు. ఎప్పుడు చర్చకు రావాలో ఈవో ధర్మారెడ్డి నిర్ణయించి సమయం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!