Tirumala: తిరుమల ఘాట్ లో కొండచిలువ ప్రత్యక్షం
తిరుమల శ్రీవారి భక్తులను వన్యప్రాణుల భయం వెంటాడుతోంది. ఇటీవల నడకదారిలో వెళ్లే భక్తులకు చిరుతపులులు, ఎలుగుబంట్లు దర్శనమిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నడకదారిన తిరుమల కొండకు వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆ భయం వీడకముందే ఇప్పుడు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండ చిలువ ప్రత్యక్షమైంది. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డు లోని 7వ మైలు వద్ద సుమారు 10 అడుగుల కొండచిలువను వాహనాల్లో వచ్చే భక్తులు గుర్తించారు.
తిరుమల శ్రీవారి భక్తులను వన్యప్రాణుల భయం వెంటాడుతోంది. ఇటీవల నడకదారిలో వెళ్లే భక్తులకు చిరుతపులులు, ఎలుగుబంట్లు దర్శనమిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నడకదారిన తిరుమల కొండకు వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆ భయం వీడకముందే ఇప్పుడు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కొండ చిలువ ప్రత్యక్షమైంది. తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డు లోని 7వ మైలు వద్ద సుమారు 10 అడుగుల కొండచిలువను వాహనాల్లో వచ్చే భక్తులు గుర్తించారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భయంతో వాహనాలను నిలిపివేశారు. వాహనాల లైట్ల వెలుగు తనపై పడటంతో కొంత సమయం కొండచిలువ ఘాట్ రోడ్డుపైనే నిలిచి పోయింది. అనంతరం కొద్ది సమయం తర్వాత కొండచిలువ రోడ్డు దాటి అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువ ఘాట్ రోడ్డుపై నిలిచిన సమయంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులకు కొండచిలువ గురించి సమాచారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లగ్జరీ ఫ్లాట్ కొన్న స్టార్ హీరో కూతురు !! ధర రూ. 15.75 కోట్లపై మాటే
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

