AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirituality Tips: ఏయే కలలు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా!

సాధారణంగా ఎవరికైనా కలలు అనేవి వస్తూ ఉంటాయి. కలలు రావడం అనేది చాలా సహజమైన విషయం. వాటిల్లో కొన్ని సంతోషం ఉన్నవి ఉంటాయి. మరి కొందరికి పీడ కలలు కూడా వస్తూంటాయి. ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిల్లో కొన్ని కలలు గుర్తుంటాయి. మరికొన్ని గుర్తుండవు. అయితే పురాణాలు, వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయట. స్వప్న శాస్త్రం ప్రకారం.. మన కలలో వచ్చే కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి..

Spirituality Tips: ఏయే కలలు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా!
Dreams
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 05, 2023 | 9:59 PM

Share

సాధారణంగా ఎవరికైనా కలలు అనేవి వస్తూ ఉంటాయి. కలలు రావడం అనేది చాలా సహజమైన విషయం. వాటిల్లో కొన్ని సంతోషం ఉన్నవి ఉంటాయి. మరి కొందరికి పీడ కలలు కూడా వస్తూంటాయి. ఇంకొన్ని విచిత్రంగా ఉంటాయి. వీటిల్లో కొన్ని కలలు గుర్తుంటాయి. మరికొన్ని గుర్తుండవు. అయితే పురాణాలు, వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయట. స్వప్న శాస్త్రం ప్రకారం.. మన కలలో వచ్చే కొన్ని నిజం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు.. మనుషుల్ని కూడా చూసినట్టు అనిపిస్తుంది. అది కూడా కలల ప్రభావం అయి ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. కలలో కనిపించే కొన్నింటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు:

కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభ కార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంటే ఇంట్లో ఏదో రూపంలో శుభం జరుగుతుందని గ్రహించాలి. అదే మాసం తింటున్నట్లు కలలు వస్తే.. మీకు గాయాలు అవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి వాటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

దెబ్బలు తింటున్నట్లు:

చాలా మందికి కలలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే.. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారట. అలాగే గాల్లో తేలినట్లు కనిపిస్తే.. మీరు ప్రయాణం చేస్తారని అర్థం చేసుకోవాలి.

ఇలా కనిపిస్తే సంతోషమే:

కలలో కాళ్లూ, చేతులూ కడుగుతున్నట్లు కనిపిస్తే.. మీకు ఉన్న సమస్యలు, దుఖాలు తొలగి పోతాయని అర్థం చేసుకోవాలి. అలాగే పెళ్లి కూతురు ముద్దాడుతున్నట్లు కనిపించినా సమస్యలు పోతాయి.

ఒంటె కనిపిస్తే రాజ భయం ఉంటుంది:

కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజ భయం ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే పాములు కనిపిస్తే భవిష్యత్తులో మీరు అనున్నవి నెరవేరుతాయట. కానీ పాములు ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తూంటాయి. పాములు కాటు వేసి.. రక్తం వచ్చినట్టు కలలో కనిపిస్తే మీకు కష్టాలన్నీ తీరి.. అదృష్టం పట్టపోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పామును మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి.

కుక్క కరిస్తే కష్టాలు:

కలలో కుక్క కరిచినట్లు కనిపిస్తే.. త్వరలోనే కష్టాలు ప్రారంభం అవుతాయని అర్థం చేసుకోవాలి. అలాగే నెమలి కనిపిస్తే దుఖం కలుగుతుందట.

ఇలా ఒక్కో సందర్భాన్ని బట్టి.. స్వప్న శాస్త్రంలో వివరంగా తెలిపారు. అయితే కొన్ని సందర్భాల బట్టి వాటి ప్రతి ఫలాలు వేరుగా ఉంటాయి. మరి కొన్నింటికి గురించి మళ్లీ తెలుసుకుందాం.

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా