AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perugu Curry: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెరుగుతో ఇలా కర్రీ చేయండి.. అదిరిపోతుంది!

పెరుగుతో కూర ఏంటి? అని అనుకుంటున్నారా.. దీన్ని చట్నీ అని కూడా పిలుస్తారు. ఇంట్లో కూరగాయాలు ఏమీ లేనప్పుడు.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెరుగుతో కర్రీ చేసుకుని తినవచ్చు. ఇది అన్నంలోకి, టిఫిన్స్ లోకి, పలావ్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా దేనిలోకైనా తినవచ్చు. ఏదైనా కర్రీస్ వాటిల్లోకి గ్రేవీ కింద కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. తినడానికి టేస్టీగా ఉంటుంది. వంట రాని వారు సైతం దీన్ని ఎంతో..

Perugu Curry: ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెరుగుతో ఇలా కర్రీ చేయండి.. అదిరిపోతుంది!
Cooking Tips
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 05, 2023 | 9:59 PM

Share

పెరుగుతో కూర ఏంటి? అని అనుకుంటున్నారా.. దీన్ని చట్నీ అని కూడా పిలుస్తారు. ఇంట్లో కూరగాయాలు ఏమీ లేనప్పుడు.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెరుగుతో కర్రీ చేసుకుని తినవచ్చు. ఇది అన్నంలోకి, టిఫిన్స్ లోకి, పలావ్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా దేనిలోకైనా తినవచ్చు. ఏదైనా కర్రీస్ వాటిల్లోకి గ్రేవీ కింద కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. తినడానికి టేస్టీగా ఉంటుంది. వంట రాని వారు సైతం దీన్ని ఎంతో ఈజీగా చేసేస్తారు. మరి ఈ పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు కర్రీకి కావాల్సిన పదార్థాలు:

పెరుగు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివే పాకు, కొత్తి మీర, ఇంగువ, నూనె, ఉల్లి పాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు.

ఇవి కూడా చదవండి

పెరుగు కర్రీ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలోకి మీకు సరిపడినంతగా పెరుగును తీసుకోవాలి. పెరుగును ముందు చిలికి తీసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలక్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అవసరం అయితే కొద్దిగా వాటర్ వేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో నూనె వేసి వేడెక్కాక.. కరి వేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరి వేపాకు వేగాక.. ఇంగువ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించు కోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత.. అన్నీ కలిపి పెట్టుకున్న పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి.. మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం.. దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తి మీర చల్లుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కర్రీ సిద్ధం. దీన్ని ఏ ఐటెమ్ లోకి అయినా వేసుకుని తినవచ్చు. ఈ సారి అన్నంలోకి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేసి చూడండి.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..