- Telugu News Photo Gallery Which of the cow's and buffalo's milks is better to drink?, check here is details
Interesting Facts: ఆవు, గేదె పాలల్లో ఏవి తాగితే మంచిది.. ఏ వయసులో ఎలాంటి పాలు తాగాలి?
ఆవు, గేదె పాలు ఇవి రెండూ ఆహారంలో ఒక భాగమే. ఈ రెండింటిలోనూ మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అనేవి ఎక్కువగా లభ్యమవుతాయి. పాలు అనేవి ఎముకలకు, శరీర అభివృద్ధికి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఎంతో ముఖ్యమైన ఆహారం పాలు. వృద్ధ్యాప్యంలో కూడా పాలు తాగడం వల్ల చాలా మేలు చేస్తుంది. అయితే ఈ రెండింటి పాల్లలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. మరి ఏ వయసులో ఏ పాలు తాగాలో..
Updated on: Nov 03, 2023 | 10:02 PM

ఆవు, గేదె పాలు ఇవి రెండూ ఆహారంలో ఒక భాగమే. ఈ రెండింటిలోనూ మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అనేవి ఎక్కువగా లభ్యమవుతాయి. పాలు అనేవి ఎముకలకు, శరీర అభివృద్ధికి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలకు ఎంతో ముఖ్యమైన ఆహారం పాలు. వృద్ధ్యాప్యంలో కూడా పాలు తాగడం వల్ల చాలా మేలు చేస్తుంది. అయితే ఈ రెండింటి పాల్లలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. మరి ఏ వయసులో ఏ పాలు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వృద్ధులకు, పిల్లలకు ఆవు పాలు తగినవిగా పరిగణించబడతాయి. గేదె పాలు పెద్దలకు మాత్రం ప్రయోజనంగా ఉంటాయి. గేదె పాలు తాగడం వల్ల శక్తి వంతంగా, పుష్టిగా ఉంటారు. అలాగే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఆవు పాల్లలో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి. ఆవు పాలల్లో ఉండే ప్రోటీన్ పరిమాణం.. గేదె పాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆవు పాలు సులభంగా జీర్ణం అవుతాయి. ఇందులో ప్రోటీన్ అమైనో ఆమ్లా పరంగా సమతుల్యంగా ఉంటుంది. ఆవు పాల్లలో ప్రోటీన్ కంటెంట్ దాదాపు 3.5 శాతం ఉంటుంది.

గేదె పాలల్లో ప్రోటీన్ కంటెంట్ దాదాపు 3.3 శాతంగా ఉంటుంది. గేదె పాలల్లో కొవ్వు, కేలరీలు, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి.

ఈ పరంగా చూస్తే గేదె పాల కంటే ఆవు పాలు ఉత్తమమైనవి. ఇవి పిల్లలకు, వృద్ధులకు చక్కగా సూట్ అవుతాయి. అలాగే శక్తిని అందించడంలో గేదె పాలు ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల ఇవి పెద్దలకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.




