స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా కూడా భారతదేశంలో ఈవీ మార్కెట్ వాటాలో కొంత భాగాన్ని కోరుకుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రిలీజ్ చేసిన ఎక్స్‌యూవీ 400 విక్రయాల్లో టాప్‌లో ఉంది. అయితే 2024లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700కు సంబంధించిన ఎలక్ట్రిక్ వెర్షన్‌ని ఎక్స్‌యూవీఈ8ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రెండు మోటార్లు, ఒక్కో యాక్సిల్‌కు ఒకటి శక్తినిస్తుంది.