Affordable Cars: అతి తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..

కార్లలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. అది కూడా చవకైన ధరలోనే. వాస్తవానికి కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అనే సాంకేతికత చాలా క్రితమే వచ్చినా.. అది కొంత కాలం క్రితం వరకూ చాలా హై ఎండ్ లగ్జరీ కార్లలోనే అందుబాటులో ఉండేది. దీంతో అది చిన్న కార్లు కొనుగోలు చేసుకొనే వారికి మాన్యువల్ ట్రాన్స్ మిషనే వినియోగించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు చిన్న కార్లలో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి, తక్కువ ధరకే లభించే బెస్ట్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 03, 2023 | 10:02 PM

మారుతీ సుజుకి సెలెరియో.. ఇది కూడా ఎస్ ప్రెస్సో, ఆల్టో కే10 మాదిరిగానే 66బీహెచ్పీ, 89ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 1 లీటర్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ ఏఎంటీ తో వస్తుంది. ఒక లీటర్  ఆయిల్ పై 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సెలెరియో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇగ్నిషన్ స్టార్ట్-స్టాప్ బటన్ మొదలైన వాటితో వస్తుంది. దీని ధర రూ. 6.38 లక్షల నుంచి రూ. 7.14 లక్షల(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది.

1 / 5
మారుతి సుజుకి ఆల్టో కే10.. గత సంవత్సరం కొత్త ఆల్టో కే10 మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అత్యంత సరసమైన ఆటోమేటిక్ కారు. 1-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. 66బీహెచ్పీ, 89ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ) ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్ పై 24.90 కిలోమీటర్ల మైలేజిని అందిస్తుంది. దీనిలో ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ఉంటాయి. దీని ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 5.90 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంటాయి.

2 / 5
మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో.. ఆల్టోకే 10లో ఉన్న ఇంజినే దీనిలోనూ ఉంటుంది.  5-స్పీడ్ ఏఎంటీని పొందుతుంది. లీటర్ ఇంధనంపై ఇది 25.30 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అధునాతన హిల్ హోల్డ్ అసిస్ట్, ఈఎస్పీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ మొదలైన భద్రతా ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి ప్రారంభమై రూ. 6.05 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంటుంది.

3 / 5
మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. దీనిలో కూడా 1-లీటర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 25.19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 88బీహెచ్పీ, 113ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంది. నావిగేషన్ సిస్టమ్, నాలుగు స్పీకర్లతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఉంటుంది. ఇది హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లను కూడా పొందుతుంది. దీని ధర రూ.  6.54 లక్షల నుంచి రూ. 7.30 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకూ ఉంటుంది.

4 / 5
రెనాల్ట్ క్విడ్.. ఇది చూడటానికి కాంపాక్ట్ ఎస్ యూవీలా కనిపిస్తుంది. దీనిలో 67బీహెచ్పీ 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. లీటర్ పై  22.3 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 184ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీని ధర రూ. 6.12 లక్షల నుంచి రూ. 6.39 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది.

5 / 5
Follow us
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!

ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..

అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?