Chhattisgarh Elections: ‘లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తల హత్యలను సహించేది లేదు’.. ఛత్తీస్‌గఢ్ సభలో యోగి ఆదిత్యనాథ్
ఛత్తీస్‌గఢ్ ఎన్నిక ప్రచార సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తల హత్యలను సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ స్టార్ క్యాంపెనర్‌గా ఉన్న యోగి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మూడు జిల్లాల్లో ప్రచారంలో పాల్గొని బహిరంగ సభల్లో ప్రసంగించారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నిక ప్రచార సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తల హత్యలను సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ స్టార్ క్యాంపెనర్‌గా ఉన్న యోగి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మూడు జిల్లాల్లో ప్రచారంలో పాల్గొని బహిరంగ సభల్లో ప్రసంగించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే కాకుండా లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తలపై హత్యాకాండపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బస్తర్, రాజ్‌నంద్‌గావ్‌లలో బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, బస్తర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి మణిరామ్ కశ్యప్, సుక్మా జిల్లా కొంటా అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి స్వయం ముక్కాకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు యోగి. ఈ సందర్భంగా బస్తర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తలను హత్య చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
लव जिहाद के नाम पर भाजपा कार्यकर्ताओं की हत्या स्वीकार्य नहीं हो सकती… pic.twitter.com/Kc8B6Oohac
— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2023
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల సూచనల మేరకే సాజా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహు కుమారుడు హత్యకు గురయ్యాడని ఆరోపించారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఈశ్వర్ సాహు కొడుకు గళం విప్పుతున్నాడని, ఓ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ జిహాద్ ద్వారా ముస్లింగా మార్చేందుకు సాయం చేస్తున్నాడని తెలిపారు. అటువంటి పరిస్థితిలో అతను హత్యకు గురయ్యాడు. లవ్ జిహాద్ పేరుతో బీజేపీ కార్యకర్తలను హత్య చేయడం ఆమోదయోగ్యం కాదని సీఎం యోగి ఘాటుగా వ్యాఖ్యానించారు.
బస్తర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించే ముందు, వేదికపై నుండి జిల్లా పంచాయతీ సభ్యుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేకు నివాళులు అర్పిస్తూ సీఎం యోగి.. నక్సల్‌పై తన స్వరం పెంచారు. కాంగ్రెస్ ఆదేశానుసారం నక్సలైట్‌లు రతన్ దూబేను పిరికితనంతో హత్య చేశారని అన్నారు. ఇలా చేసిన వారే దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని యోగి హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీలోని మాదిరిగానే బుల్‌డోజర్‌తో నక్సలిజాన్ని అంతమొందించేందుకు కృషి చేస్తామన్నారు యోగి అదిత్యానాథ్.
भाजपा के एक कर्मठ कार्यकर्ता, जिला के उपाध्यक्ष और जिला पंचायत के सदस्य श्री रतन दुबे की निर्मम हत्या, कल कायराना तरीके से कांग्रेस के इशारे पर नक्सली तत्वों ने की है…
उन्हें विनम्र श्रद्धांजलि! परिवार के सभी सदस्यों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं… pic.twitter.com/AF2W2HgXbK
— Yogi Adityanath (@myogiadityanath) November 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…