Viral House: నాలుగు అడుగుల స్థలంలో 3 అంతస్తుల భవనం.. ఆకట్టుకుంటున్న ఇళ్ల నిర్మాణం.
సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. పెరుగుతున్న ధరలతో పోటీపడలేక కొందరు చిన్న స్థలంలోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాక్కై ముక్కున వేలేసుకుంటారు. వైరల్ వీడియోలో రెండు ప్రత్యేకమైన ఇళ్ళు కనబడుతున్నాయి. నిజానికి ఆ ఇంజనీర్ తెలివికి హ్యాట్సాఫ్ అనొచ్చు.
సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరి కోరిక.. కానీ, చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. పెరుగుతున్న ధరలతో పోటీపడలేక కొందరు చిన్న స్థలంలోనే ఇళ్లు నిర్మించుకుంటారు. అలాంటి రెండు ఇళ్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని చూస్తే మీరు కూడా అవాక్కై ముక్కున వేలేసుకుంటారు. వైరల్ వీడియోలో రెండు ప్రత్యేకమైన ఇళ్ళు కనబడుతున్నాయి. నిజానికి ఆ ఇంజనీర్ తెలివికి హ్యాట్సాఫ్ అనొచ్చు. ఎందుకంటే అతను కేవలం 4 అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులకు ఇది తట్టుకోగలదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న స్థలంలో నిర్మించిన ఇంటి పైకి వెళ్లేందుకు మెట్లు కూడా ఉన్నాయి. 2 అడుగుల విస్తీర్ణంలో మరో ఇల్లు నిర్మించాడు. ఇందులో పైన నివాసం, కింద షాపులు పెట్టుకునేందుకు వీలుగా షట్టర్‌లు ఏర్పాటు చేశాడు. ఈ అద్భుతమైన ఇళ్లకు సంబంధించిన వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నాలుగు అడుగుల స్థలంలో మూడు అంతస్తుల ఇల్లు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటిమందికి పైగా వీక్షించారు. దాదాపు 6 లక్షలమంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.