- Telugu News Photo Gallery If you tend to eat leftover foods after reheating them you are risking your health know how Telugu News
ఈ 5 ఆహారాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వేడి చేసి తినకూడదు.. అలా చేస్తే విషంతో సమానం!
ఏదైనా ఆహారం మిగిలిపోతే, మరుసటి రోజు దాన్ని వేడి చేసి తినటం మనకు అలవాటు. మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకూడదనే భావనతోనే దాదాపు అందరూ ఇదే చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేసి తినటం వల్ల అది మీ ఆరోగ్యానికి విషంతో సమానం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది.
Updated on: Nov 06, 2023 | 11:36 AM

బియ్యంతో చేసిన ఆహారం, అన్న వంటివి కూడా మళ్లీ వేడి చేయకూడదు. చాలా ఇళ్లలో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అన్నం ఒకేసారి తయారు చేస్తారు. ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, కోల్డ్ రైస్‌ను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.

బంగాళదుంపలలో స్టార్చ్ ఉంటుంది. ఇది మళ్లీ వేడిచేసినప్పుడు విచ్ఛిన్నమవుతుంది. విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విషం కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.

చికెన్‌ని మళ్లీ వేడి చేయడం వల్ల దాని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. వేరే రూపాన్ని తీసుకుంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. ఉడికించిన చికెన్‌ను మైక్రోవేవ్‌లో ఉంచినట్లయితే, బ్యాక్టీరియా మాంసం అంతటా వ్యాపిస్తుంది.

గుడ్డులో ప్రొటీన్ ఉంటుంది. మళ్లీ వేడిచేసినప్పుడు హానికరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటివి ఎటాక్ చేసే ప్రమాదం ఉంది.

బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలతో చేసిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినకూడదు. ఇందులో నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రోసమైన్‌గా మారుతుంది. నైట్రోసమైన్ ఒక క్యాన్సర్ కారకం. నైట్రోసమైన్‌లను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.





























