- Telugu News Photo Gallery Cinema photos Tollywood actors attends Varun Tej and Lavanya Tripathi's reception in hyderabad telugu movie news
Varun Tej-Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గ్రాండ్ రిసెప్షన్.. తరలివచ్చిన తారలు..
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. టుస్కానీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగా వైభవంగా జరిగిన వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీతోపాటు.. పవర్ స్టార్ ఫ్యామిలీ, హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లి నాలుగు రోజులపాటు పెళ్లి వేడుకలను ఘనంగా చేశారు.
Updated on: Nov 06, 2023 | 11:49 AM

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.

టుస్కానీలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగా వైభవంగా జరిగిన వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీతోపాటు.. పవర్ స్టార్ ఫ్యామిలీ, హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు.

పెళ్లికి వారం రోజుల ముందే మెగా ఫ్యామిలీ ఇటలీ వెళ్లి నాలుగు రోజులపాటు పెళ్లి వేడుకలను ఘనంగా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.

ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ చేరుకున్నారు. వీరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఇక ఆదివారం సాయంత్రం సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో వరుణ్, లావణ్య రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. హీరో వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, సుశాంత్, అడివి శేష్, సునీల్, హీరో కార్తికేయ ఈ వేడుకలో సందడి చేశారు.

అలాగే సందీప్ కిషన్, అల్లు శిరీష్ , భారత బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ వంటి ప్రముఖుల హాజరై కొత్త జంటను శుభాకాంక్షలు తెలిపారు.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గ్రాండ్ రిసెప్షన్.. తరలివచ్చిన తారలు..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గ్రాండ్ రిసెప్షన్.. తరలివచ్చిన తారలు..




