దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం

దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం

Ram Naramaneni

|

Updated on: Nov 06, 2023 | 1:07 PM

నాలుగేళ్లుగా శీతాకాలం వచ్చిందంటే దేశరాజధానిలో పరిస్థితులు ఘోరంగా మారిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగలపెట్టడం వల్ల వచ్చే పొగ ఈ పరిస్థితులకు ఓ కారణంగా చెప్తున్నా.. గతంతో పోలిస్తే ఈసారి ఇలాంటివి బాగా తగ్గాయని అధికారులు చెప్తున్నారు. కానీ AQI చూస్తే పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది.

ఢిల్లీలో బతకడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే అన్నట్టుంది. ప్రస్తుతం అక్కడ అత్యంత ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం చేరిపోయింది. AQI సీవియర్ ప్లస్‌ కేటగిరీకి చేరింది. ఇవాళ ఇది 500 దాటేసింది. NCR ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే ఢిల్లీలో డీజిల్‌ వాహనాలపై నిషేధం విధించారు. కన్‌స్ట్రక్షన్‌ పనులు కూడా ఆపేయాలని ఆదేశించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, వీలైంత వరకూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ వాడాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈసారి నవంబర్‌ నెలలోనే వాయు కాలుష్యం తీవ్రమవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.

కాలుష్యం పెరిగిపోయి ఆ పొగమంచు ఢిల్లీని కమ్మేయడంతో…. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను కూడా రద్దు చేసుకుందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

 

Published on: Nov 06, 2023 01:07 PM