Old Monk Tea: ‘గ‌రం గ‌రం మద్యం చాయ్‌’ అబ్బో ఈ చాయ్ వాలా గిరాకీ చూస్తే మతిపోవాల్సిందే! వీడియో వైరల్

జిహ్వకో రుచి పుర్రెకోబుద్ది అన్నట్లు ఓ వ్యక్తి తయారు చేయిన ఛాయ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాదారణంగా మదుపాన ప్రియులు విస్కీ, రమ్‌, గుట్కా, మట్కా, సారా వంటి వాటిల్లో ఏదో ఒకటి ఫూటుగా కొట్టి వాడి మానాన వాడు పోతాడు. మరికొందరు దానిలో దీన్నీ, దీనిలో దాన్ని కలుసుకుని అదో రకమైనకిక్కానందం పొందుతాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం మందు చుక్కతో ఏంగా టీ తయారు చేశాడండీ. ఛీ.. యాక్‌! మద్యంతో టీ తయారు చేయడమేంటని అనుకోకండి. రోడ్డు పక్కన పెట్టిన ఇతగాడి..

Old Monk Tea: 'గ‌రం గ‌రం మద్యం చాయ్‌' అబ్బో ఈ చాయ్ వాలా గిరాకీ చూస్తే మతిపోవాల్సిందే! వీడియో వైరల్
Old Monk Tea
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 07, 2023 | 2:59 PM

జిహ్వకో రుచి పుర్రెకోబుద్ది అన్నట్లు ఓ వ్యక్తి తయారు చేయిన ఛాయ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సాదారణంగా మదుపాన ప్రియులు విస్కీ, రమ్‌, గుట్కా, మట్కా, సారా వంటి వాటిల్లో ఏదో ఒకటి ఫూటుగా కొట్టి వాడి మానాన వాడు పోతాడు. మరికొందరు దానిలో దీన్నీ, దీనిలో దాన్ని కలుసుకుని అదో రకమైనకిక్కానందం పొందుతాడు. కానీ ఓ వ్యక్తి మాత్రం మందు చుక్కతో ఏంగా టీ తయారు చేశాడండీ. ఛీ.. యాక్‌! మద్యంతో టీ తయారు చేయడమేంటని అనుకోకండి. రోడ్డు పక్కన పెట్టిన ఇతగాడి టీ కోట్టుకు ముందు కస్టమర్స్‌ క్యూకట్టి మరీ ఈ టీ రుచి చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని కథేంటో మీరూ తెలుసుకోండి..

గోవాలోని బీచ్‌లో రోడ్డు పక్కనున్న టీ దుఖాణంలో కనిపిస్తున్న దృశ్యం ఇది. ఈ వీడియోలో ఓ వ్యక్తి టీ తయారీలో వినూత్న ప్రయోగం చేయడాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక చిన్న కుండలో మద్యం పోసి, దానితో టీ తయారు చేస్తుంటాడు. ముందుగా చిన్న కుండను బాగా నిప్పుల్లో వేడి చేసి అందులో టీ తయారు చేసేందుకు అవసరమైన అన్ని పదార్ధాలు స్పూన్‌తో వేయడం కనిపిస్తుంది. అయితే టీలో పాలకు బదులు ఇతగాడు పాత రమ్‌ను కలపడం వీడియోలో చూడొచ్చు. ఇలా తయారు చేసిన చాయ్‌కు ‘ఓల్డ్ బాంక్ రమ్ చాయ్’ అని పిలుస్తున్నారు. దీనికి చాయ్ ప్రియులే కాదు మద్యం ప్రియులు కూడా ఫిదా అయిపోతున్నారు. చాయ్ ల్లో ఎన్ని రకాలున్నా, ఎన్ని రుచులున్నా నా ఓల్డ్ మాంక్ చాయ్ టేస్టే వేరప్ప అంటున్నాడీ చాయ్ వాలా.

ఇవి కూడా చదవండి

ఎలాగైతేనేం త‌న చాయ్‌కి గిరాకీ పెంచుకునేందుకు వెరైటీగా ఆలోచించి, పాపులారిటీ దక్కించుకున్నాడు. ఓ ఐడియా ఇతని జీవితాన్నే మార్చేసింది. ఓల్డ్ మాంక్ ర‌మ్‌తో తయారు చేసిన గ‌రం గ‌రం చాయ్ కూడా ఈ టీవాలా గిరాకీనే తలకిందులు చేసింది. టూరిస్ట్‌లు ఎక్కువ‌గా వ‌చ్చే బీచ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఈ చాయ్‌ని మట్టికప్పులో పోసి ఇస్తుంటే ఎగబడి మరీ లొట్టలేసుకుంటూ తాగేస్తున్నారు జనాలు. గోవా బీచ్‌లో ఈ ఓల్డ్ మాంక్ ర‌మ్ చాయ్ తెగ ఫేమస్ అయిపోయింది. ఈ బీచ్‌కి వ‌చ్చిన‌వాళ్లు ఈ వెరైటీ ఛాయ్‌ని టేస్ట్ చేసి మ‌రీ వెళ్తున్నారు. కొంతమంది మన్స్ మోర్ అంటుంటే మరికొందరు మాత్రం ఓకే వెరైటీగా ఉందంటున్నారు. ఇది పాత వీడియో అయినప్పటికీ లక్షల్లో వీక్షణలు, లైకులు, కాంమెంట్లు రావడంతో ప్రస్తుతం మళ్లీ వైరల్‌ అవుతోంది. మీరూ వీక్షించండి..

మరిన్ని జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్