Ozempic: త్వరలోనే పెళ్లి.. శుభకార్యంలో సన్నగా మెరుపుతీగలా కనిపించాలని ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంది! అంతే..
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తన కుమార్తె వివాహ వేడుకలో సన్నగా, నాజుగ్గా మెరుపుతీగలా కనిపించాలనుకుందా తల్లి. అయితే అందుకు షాట్‌కట్స్ నమ్ముకుంది. ఆ నిర్ణయమే తన కూతురు పాలిట మృత్యువుగా మారుతుందని ఊహించలేకపోయింది. అందుకోసం ఆమె తనచేతులతో కూతురికి ఇచ్చిన మెడిసిన్ నిండు జీవితాన్ని బలితీసుకుంది. త్వరితగతిన బరువు తగ్గాలని ఓ కంపెనీ బూటకపు ప్రకటన నమ్మి కన్న కూతురి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది..
ఆస్ట్రేలియా, నవంబర్ 9: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తన కుమార్తె వివాహ వేడుకలో సన్నగా, నాజుగ్గా మెరుపుతీగలా కనిపించాలనుకుందా తల్లి. అయితే అందుకు షాట్‌కట్స్ నమ్ముకుంది. ఆ నిర్ణయమే తన కూతురు పాలిట మృత్యువుగా మారుతుందని ఊహించలేకపోయింది. అందుకోసం ఆమె తనచేతులతో కూతురికి ఇచ్చిన మెడిసిన్ నిండు జీవితాన్ని బలితీసుకుంది. త్వరితగతిన బరువు తగ్గాలని ఓ కంపెనీ బూటకపు ప్రకటన నమ్మి కన్న కూతురి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాధ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఆస్ట్రేలియాకు చెందిన 56 ఏళ్ల ట్రిష్ వెబ్‌స్టర్ మహిళ తన కూతురు పెళ్లిలో స్లిమ్‌గా కనిపించాలనుకుంది. అందుకోసం వైద్యులను సంప్రదించి మరీ ఓజెంపిక్ మెడిసిన్ కూతురికి ఇచ్చింది. దీని ప్రభావం వల్ల కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కూతురు బరువు తగ్గిందని సంతోషించే లోపు ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమార్తె అంతర్గత జీర్ణశయాంతర అనారోగ్యంతో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే సీఆర్‌పీ చేసి, ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబంలోపు ఉన్నటుండి హఠాత్తుగా ఓ రోజు కుప్పకూలి చనిపోయింది.
ట్రిష్ వెబ్‌స్టర్ తన కూతురికి ఇచ్చిన ఓజెంపిక్ మెడిసిన్ టైప్-2 మధుమేహానికి ఉపయోగిస్తారు. దీనిని చర్మం కింద ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఈ మెడిసిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానకి పేషెంట్లకు సూచిస్తుంటారు. అలాగే ఓజెంపిక్ గుండెపోటులు, స్ట్రోక్ ప్రమాదంతో సహా వివిధ గుండె జబ్బులు ఉన్న వ్యక్తుల్లో కొన్ని ప్రమాదాలను తగ్గించడంలో కూడా ఈ మెడిసిన్ ఉపయోగిస్తారు. అదే ఆమెకు శాపమై జీర్ణశయాంతర వ్యాధికి దారితీసి చనిపోయినట్లు ట్రిష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ బరువు తగ్గించే ఔషధం సైడ్‌ఎఫెక్ట్ కారణంగానే ఆమె మరణించిందని అంటున్నారు.
త్వరగా బరువు తగ్గడానికి వినియోగిస్తున్న ప్రసిద్ధ ఔషధం ఓజెంపిక్. ఓజెంపిక్ ఔషదం.. సహజ హార్మోన్ అయిన GLP-1ని ప్రభావితం చేస్తుంది. ఇది కడుపులోని ప్రేగుల ద్వారా ఆహారం వెళ్లడాన్ని నెమ్మదింప చేస్తుంది. ఫలితంగా ఆకలి మందగించి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ( ఈ మెడిసిన్ తీసుకుంటే మలబద్ధకం, అతిసారం, వికారం, పొత్తి కడుపు నొప్పి, వాంతులుతో మొదలై థైరాయిడ్ క్యాన్సర్, డయాబెటిక్రెటినోపతి వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది) ఇలా చేయడం వల్ల ఇలియస్ అనే రుమ్మతకు దారితీస్తుంది. Ozempic తీసుకున్న వ్యక్తులలో కనీసం 18 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.