AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robot kills Man: సూపర్‌ స్టార్‌ రజినీ ‘రోబో’ సీన్‌ రిపీట్‌.. రోబో చేతిలో వ్యక్తి మృతి!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రోబో’ మువీ గుర్తుందా? ఈ సినిమాలో డాక్టర్‌ వసీగరన్‌ తయారు చేసిన చిట్టీ కారు డ్రైవింగ్‌ చేసే సీన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్ చెయ్యి తడపమంటే చాక్‌తో చెయ్యిపై గాయం చేస్తుంది. అలాగే మరొక సన్నివేశంలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దక్షిణ కొరియాలో ఓ ఫ్యాక్టరీలో జరిగింది. సినిమాలోని ఈ సన్నివేశం కామెడీగా అనిపించినీ నిజ జీవితంలో మాత్రం ఓ నిండు..

Robot kills Man: సూపర్‌ స్టార్‌ రజినీ 'రోబో' సీన్‌ రిపీట్‌.. రోబో చేతిలో వ్యక్తి మృతి!
Robot Kills Factory Worker
Srilakshmi C
|

Updated on: Nov 09, 2023 | 3:08 PM

Share

దక్షిణ కొరియా, నవంబర్‌ 9: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రోబో’ మువీ గుర్తుందా? ఈ సినిమాలో డాక్టర్‌ వసీగరన్‌ తయారు చేసిన చిట్టీ కారు డ్రైవింగ్‌ చేసే సీన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్ చెయ్యి తడపమంటే చాక్‌తో చెయ్యిపై గాయం చేస్తుంది. అలాగే మరొక సన్నివేశంలో ప్రొఫెసర్‌ బోరా తయారు చేసిన రోబో గన్ను తీయమంటే బన్ను తీస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దక్షిణ కొరియాలో ఓ ఫ్యాక్టరీలో జరిగింది. సినిమాలోని ఈ సన్నివేశం కామెడీగా అనిపించినీ నిజ జీవితంలో మాత్రం ఓ నిండు జీవితం బలైంది. టెక్నాలజీని సరిగా వినియోగించకుంటే జరిగే అనర్ధాలు ఎంతటి పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయనడానికి ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణ.

దక్షిణ కొరియాలోని ఓ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఫ్యాక్టరీలో రోబో అనుసంధానంతో పనిచేసే ఓ మెషీన్‌ చిన్నపాటి గందరగోళానికి గురయ్యింది. కూరగాయలతో ప్యాక్‌ చేసిన బాక్స్‌ను, మనిషిని పోల్చుకోవడంలో విఫలమైంది. నిజానికి, ఆ ఫ్యాక్టరీలోని రోబోట్‌ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి బాక్స్‌ను వేరుపరచడం దాని విధి. అయితే అదే కంపెనీలో ప్యాకింగ్‌ విభాగంలో 40 ఏళ్ల రోబోట్‌ సెన్సార్‌ను తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో కూరగాయలతో నింపిన బాక్స్‌లను తీసి కన్వేయర్‌ బెల్ట్‌పై వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేసే ఒక రోబో దగ్గర్లో ఉన్న వ్యక్తిని కూరగాయల బాక్స్‌గా భావించింది. అంతే అతణ్ని లాగి బెల్ట్‌పై బలంగా పడేసింది. అది తన మరచేతులతో మనిషిని గట్టిగా పట్టుకున్నప్పుడు అతడి ఛాతి, ముఖం ఛిద్రమయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. రోబో బాధిత వ్యక్తిని పొరబాటున బాక్స్‌గా గుర్తించి ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.

రోబోలో లోపం వల్ల అది మనిషిని బాక్స్‌లా గుర్తించిందని కంపెనీ వివరణ ఇచ్చింది. రెండు రోజుల క్రితమే రోబో సెన్సర్‌లో లోపం ఉందని ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. దాన్ని బాగు చేయడానికి తయారీ కంపెనీ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుడు దాన్ని బాగు చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ మరమ్మతు నిర్వహిస్తున్న వ్యక్తినే అది పొరబడి చంపింది. దీంతో విధుల్లో అజాగ్రత్తగా వ్యవహరించినందుకు అక్కడి భద్రతా నిర్వాహకులపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వెంటనే సురక్షితమైన వ్యవస్థను రోబోట్స్‌లో ప్రోగ్రాం చేయవల్సిందిగా కంపెనీ యాజమన్యాన్ని ఆదేశించారు. నవంబర్‌ 6 రోబోట్‌లో సాంకేతి సమస్య తలెత్తితే ఆ మరుసటి రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదం జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో ఓ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్నప్పుడు రోబో చేతిలో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. గత జులై నెలలో రష్యాలో చెస్‌ ఆడుతున్నక్రమంలో వేగంగా కదులుతున్న ఏడేళ్ల బాలుడి చేతిని పట్టుకుని వేళ్లు విరిచేసింది. బాలుడు ఆడుతున్న వేగాన్ని రోబో గందరగోళ పరిచింది. దీంతో కన్‌ఫ్యూజ్‌ అయ్యి బాలుడి వేలి

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.