AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, గంజాయి ఇచ్చి మరీ..

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన టీచరే తప్పటడుగులు వేసింది. కామంతో వికృత చేష్టలకు పాల్పడింది.. బాలుడికి మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేసింది. చివరకు బాధిత యువకుడు అసలు విషయం చెప్పడంతో కటకటాలపాలై ఊచలు లెక్కిస్తోంది.

Viral: టీచర్ రూపంలో కామపిశాచి.. స్టూడెంట్‌కు మద్యం, గంజాయి ఇచ్చి మరీ..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 09, 2023 | 1:49 PM

Share

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన టీచరే తప్పటడుగులు వేసింది. కామంతో వికృత చేష్టలకు పాల్పడింది.. బాలుడికి మద్యం, డ్రగ్స్ అలవాటు చేసి బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేసింది. చివరకు బాధిత యువకుడు అసలు విషయం చెప్పడంతో కటకటాలపాలై ఊచలు లెక్కిస్తోంది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉన్న సమయంలో లేడీ టీచర్‌ తనతో శృంగారంలో పాల్గొందని.. మద్యం, డ్రగ్స్ ఇచ్చి బలవంతపెట్టిందని ఆ యువకుడు ఆరోపణలు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకుపంపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంట్‌గోమెరి విలేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో మెలిసా మేరి కర్టిస్‌ అనే యువతి గతంలో టీచర్‌గా పనిచేసింది. అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిపై కన్నేసిన టీచర్ కర్టిస్‌ అతనితో శృంగారంలో పాల్గొంది. 2015లో ఈ ఘటన జరగగా.. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు.. ఇటీవల బాధితుడు విద్యార్ధిగా ఉన్నప్పుడు తనతో టీచర్‌ బలవంతంగా శృంగారం చేయించిందంటూ ఆరోపించాడు. అయితే, యువకుడి ఆరోపణలపై స్పందించిన మాంట్‌గోమరీ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మేరీ కర్టిస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే, పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చి కర్టిస్‌ శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 31న ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేశామని, మాజీ టీచర్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు లోతుగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మార్ల్‌బోరోకు చెందిన 31 ఏళ్ల మెలిస్సా మేరీ కర్టిస్‌ ఆ సమయంలో బాలుడితో 20 కంటే ఎక్కువ సార్లు లైంగిక దాడికి పాల్పడిందని.. కర్టిస్ అక్కడ సుమారు రెండేళ్లు టీచర్‌గా పనిచేసిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఎదుట తన నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. కాగా.. కర్టిస్ 2017 నుంచి ఉద్యోగం చేయడం లేదని మాంట్‌గోమేరీ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..