AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Picture: ఏంటీ.. హెల్మెట్‌ అనుకుంటున్నారా? ఏం ధరించాడో సరిగ్గా చూశారంటే నవ్వాగదు..!

ఐటీ హబ్‌ బెంగళూరులో ఈ మధ్యకాలంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రకరకాల మీమ్స్‌ సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరొక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు టూవీలర్‌ ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన దాదాపు దేశం అంతటా అమలు అవుతోంది. తద్వారా రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా బైక్‌ నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్..

Viral Picture: ఏంటీ.. హెల్మెట్‌ అనుకుంటున్నారా? ఏం ధరించాడో సరిగ్గా చూశారంటే నవ్వాగదు..!
Man Wear Paper Bag While Riding
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 14, 2023 | 3:40 PM

బెంగళూరు, నవంబర్‌ 14: ఐటీ హబ్‌ బెంగళూరులో ఈ మధ్యకాలంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రకరకాల మీమ్స్‌ సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరొక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు టూవీలర్‌ ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన దాదాపు దేశం అంతటా అమలు అవుతోంది. తద్వారా రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా బైక్‌ నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనేది ట్రాఫిక్ రూల్. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అయినా కొంతమంది హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. అందుకు వేరే కారణాలు ఏవో చెబుతుంటారు లేండి..! కానీ హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మాత్రం పర్సు ఖాళీ అవ్వాల్సిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వినూత్నంగా ఆలోచించి అందరికీ నవ్వు తెప్పించాడు.

ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హెల్మెట్‌ ధరించి నగర ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎదురు చూస్తున్నారు. అయితే బైక్‌ రైడ్‌ చేసే వ్యక్తి వెనుకసీట్లో కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్‌ ధరించాడు. అయితే అది అందరూ ధరించే హెల్మెట్‌ కాదు. కిరాణా దుఖాణాల్లో ఇచ్చే పేపర్‌ కవర్‌. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు రోడ్డుపై ఈ విచిత్ర సంఘటన కనిపించింది. నల్లటి టీషర్టు ధరించిన వ్యక్తి బైక్‌పై కూర్చుని కనిపించాడు. అతని తలకు మాత్రం మామూలు హెల్మెట్‌కు బదులు పేపర్‌ బ్యాగ్‌ ధరించి ఉండటం కనిపించింది. దీంతో సదరు వ్యక్తి ఫొటోను కెమెరాలో బంధించి ఫొటోనే థర్డ్‌ఐ అనే ట్విటర్‌ యూజర్‌ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ పోస్టు గంటల వ్యవధిలోనే వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

‘ఏఐ కెమెరాలకు ఈ మాత్రం తేడాను గుర్తించే బుర్ర లేదులే.. నో ప్రాబ్లెం బ్రో’ అని ఒకరు, ‘ఇన్నోవేషన్ ఐడియా!! దుమ్ము, చలి, కలుషితమైన గాలి నుంచి రక్షణ కల్పించే కొత్త హెల్మెట్‌ అని ఇంకొకరు, ‘అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్’ అని మరొకరు.. ‘స్వీట్స్ హెల్మెట్ కవర్‌ను 100% రీసైక్లింగ్‌ చేయొచ్చని బలే చెప్పావ్‌ బ్రో..’ అంటూ రకరకాల కామెంట్స్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు.. ఇలా చేస్తే ట్రాఫిక్‌ పోలీస్‌ నుంచి తప్పించుకోవచ్చా.. ?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.