Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vistara Flight: సరిగ్గా ల్యాండింగ్ టైమ్‌కి రన్‌వే పై అనుకోని అతిథి.. ల్యాండ్‌ అవ్వకుండానే వెనుదిరిగిన విమానం

విస్తారా ఎయిర్‌ లైన్స్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్‌ అయ్యే సమయానికి ఓ వీధికుక్క కనిపించింది. దీంతో అప్రమత్తం అయినఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. రన్‌వేపై విమానం ల్యాండ్‌ చేయడం సురక్షితం కాదని గమనించాడు. అయితే పైలట్‌ కాసేపు హోల్డ్‌ చేయమని సూచించినప్పటికీ అతను తిరిగి బెంగళూరు వెళ్దామని తెలిపాడు. అందువల్లనే విమానం ల్యాండ్‌ అవ్వకుండా బెంగళూరు తిరిగి..

Vistara Flight: సరిగ్గా ల్యాండింగ్ టైమ్‌కి రన్‌వే పై అనుకోని అతిథి.. ల్యాండ్‌ అవ్వకుండానే వెనుదిరిగిన విమానం
Vistara Flight Returns To Bengaluru
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 14, 2023 | 7:23 PM

బెంగళూరు, నవంబర్‌ 14: ల్యాండింగ్‌ కోసం వచ్చిన ఓ ఎయిర్‌ పోర్ట్‌ ఆకరి నిముషంలో రన్‌వైపై ల్యాండ్‌ కాకుండానే తిరిగి వెళ్లిపోయింది. ఓ కుక్క అందుకు కారణం. అదేంటీ అనుకుంటున్నారా? ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్‌చల్‌ చేయడంతో ల్యాండ్‌ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి గోవాలోని దబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న ఈ సంఘటన సోమవారం చోటుచేసుకోగా మంగళవారం (నవంబర్‌ 14) వెలుగు చూసింది.

విస్తారా ఎయిర్‌ లైన్స్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్‌ అయ్యే సమయానికి ఓ వీధికుక్క కనిపించింది. దీంతో అప్రమత్తం అయినఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌.. రన్‌వేపై విమానం ల్యాండ్‌ చేయడం సురక్షితం కాదని గమనించాడు. అయితే పైలట్‌ కాసేపు హోల్డ్‌ చేయమని సూచించినప్పటికీ అతను తిరిగి బెంగళూరు వెళ్దామని తెలిపాడు. అందువల్లనే విమానం ల్యాండ్‌ అవ్వకుండా బెంగళూరు తిరిగి వెళ్లిపోయినట్లు గోవా ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌వీటీ ధనంజయరావ్‌ మీడియాకు తెలిపాడు. గతంలోనూ పలుమార్లు వీధికుక్కలు రన్‌వేలోకి ప్రవేశించిన సందర్భాలు ఉన్నాయని, అయితే ఆ ప్రాంతాన్ని గ్రౌండ్ స్టాఫ్ వెంటనే క్లియర్ చేస్తారని ఆయన తెలిరు. గత ఒకటిన్నర యేళ్ల నా సర్వీస్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారని’ ఆయన అన్నారు.

కంపేగౌడ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నంచి సోమవారం మధ్యాహ్నం 12.55కు బయలుదేరిన విస్తారా ఎయిర్‌లైన్‌.. తిరిగి 3.05 నిమిషాలకే తిరిగి బెంగళూరు వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత బెంగళూరు నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి 6.15 గంటలకు గోవా చేరుకున్నట్టు తెలిపారు. వీధి కుక్క కారణంగా ప్యాసింజర్స్‌ దాదాపు మూడు గంటల వెయిట్‌ చేయాల్సిన వచ్చిందని విస్తారా ఎయిర్‌లైన్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు పెట్టింది.

ఇవి కూడా చదవండి

సోమవారం, విస్తారా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో..’గోవా (GOI) విమానాశ్రయంలో రన్‌వే నియంత్రణ కారణంగా బెంగళూరు నుంచి గోవాకు విమానం UK881 బెంగళూరుకు మళ్లించబడింది. తిరిగి15:05 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని మొదటి పోస్ట్‌లో పేర్కొంది. తదుపరి రెండు గంటల తర్వాత మరో పోస్ట్‌లో ‘బెంగళూరుకు మళ్లించబడిన UK881 విమానం బెంగళూరు నుంచి 16:55 గంటలకు బయలుదేరి సాయంత్రం 18:15 గంటలకు గోవా చేరుకునే అవకాశం ఉన్నట్లు తన పోస్టులో పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.