Stray Dogs Attack: ఆరేళ్ల చిన్నారిపై ఎగబడ్డ వీధికుక్కల గుంపు.. పీక్కుతిన్న వైనం
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వీధికుక్కలు భీభత్సం సృష్టించాయి. ఓ కుక్కల గుంపు 6 ఏళ్ల చిన్నారిపై మూకుమ్మడిగా దాది చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ధృవీకరించారు. కుక్కల దాడిలో బలమైన గాయాలు కావడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అల్లారు..
చెన్నై, నవంబర్ 15: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వీధికుక్కలు భీభత్సం సృష్టించాయి. ఓ కుక్కల గుంపు 6 ఏళ్ల చిన్నారిపై మూకుమ్మడిగా దాది చేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు ధృవీకరించారు. కుక్కల దాడిలో బలమైన గాయాలు కావడంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోవడంతో బిడ్డ తల్లిదండ్రులతోపాటు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
బరేలీలోని షేర్‌ఘర్ పట్టణంలోని 5వ వార్డులో నివసిస్తున్న చేదలాల్ భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. వారి 6 ఏళ్ల కుమారుడు దక్షు, ఇతర పిల్లలతోకలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. ఇక్కడి నుంచి పిల్లలు ఆడుకుంటూ అడవి వైపు వెళ్లారు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో పిల్లలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. కానీ దక్షు మాత్రం అక్కడే కింద పడిపోయాడు. దీంతో వీధి కుక్కలు దక్షుపై దాడి చేశాయి. పిల్లాడి శరీరాన్ని పీక్కుతినడంతో శరీర భాగాల నుంచి తీవ్రరక్తస్రావం అయ్యింది.
ఇంతలో, పిల్లలు గ్రామానికి పరిగెత్తుకెళ్లి దక్షు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు అడవి వైపు పరుగులు తీశారు. అక్కడ చిన్నారి రక్తం మడుగుల్లో నేలపై పడి ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు దక్షును తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి, చిన్నారి అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. దక్షు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లి ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయింది.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా మంది పిల్లలు కుక్కల బారిన పడ్డారని అన్నారు. అయితే వీధికుక్కలను ఎవరూ పట్టుకోవడనికి రావడం లేదని అన్నారు. వెంటనే కుక్కల బెడదను నివారించాలంటూ డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.