Rain Alert: వాయుగుండం గా మారిన అల్పపీడనం. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.

అండమాన్‌, నికోబార్‌ దీవులకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. బుధవారం ఉదయానికి విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారంనాటికల్లా ఇది తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు శ్రీలంక తీరాలకు సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

Rain Alert: వాయుగుండం గా మారిన అల్పపీడనం. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు.

|

Updated on: Nov 15, 2023 | 7:19 PM

అండమాన్‌, నికోబార్‌ దీవులకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది. బుధవారం ఉదయానికి విశాఖకు ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారంనాటికల్లా ఇది తీవ్ర వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు శ్రీలంక తీరాలకు సమీపంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీనుంచి అతి భారీ వర్షాలు, ఒడిశా, పశ్చిమబెంగాళ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. పశ్చివాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం మరింత బలపడి గురువారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత దిశ మార్చుకుని ఒరిస్సా వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో బుధ,గురువారాల్లో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us