Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Expiration Date: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని తెలుసా? ఎలా తెలుసుకోవాలంటే..

కిచెన్‌లో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఎక్స్​పైరీ డేట్​ఉంటుంది. అయితే కొంత మంది వీటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఎక్స్​పైరీ డేట్ చెక్‌ చేసుకుని కొంటుంటారు. మరికొందరేమో చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. అలా వాటిని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూనే ఉంటాము. లేదంటే ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాం. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. వంటగది వస్తువుల్లో గ్యాస్​ సిలిండర్​ ముఖ్యమైనది. అయితే గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని

LPG Cylinder Expiration Date: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని తెలుసా? ఎలా తెలుసుకోవాలంటే..
LPG Cylinder Expiration Date
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 16, 2023 | 4:58 PM

న్యూఢిల్లీ, నవంబర్‌ 16: కిచెన్‌లో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఎక్స్​పైరీ డేట్​ఉంటుంది. అయితే కొంత మంది వీటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఎక్స్​పైరీ డేట్ చెక్‌ చేసుకుని కొంటుంటారు. మరికొందరేమో చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. అలా వాటిని తీసుకొచ్చి సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూనే ఉంటాము. లేదంటే ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాం. ఫలితంగా రోగాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. వంటగది వస్తువుల్లో గ్యాస్​ సిలిండర్​ ముఖ్యమైనది. అయితే గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని చాలా మందికి తెలియదు.

వంటకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్​ సిలిండర్‌కి కూడా ఎక్స్​పైరీ తేదీ అనేది ఉంటుంది. చాలా మందికి ఈ విషయం తెలియక కొందరు గ్యాస్‌ సిలిండర్‌న్ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ పొరబాట్ల వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వాటిని వినియోగించడం వల్ల గ్యాస్‌ లీకేజీలు, ఒక్కోసారి పేలుళ్లు కూడా సంభవిస్తుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం సిలిండర్​ జీవిత కాలం ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని వినియోగించకూడదు. అయితే గ్యాస్‌ సిలిండర్ గడువు తేదీ ఎక్కడ ఉంటుందో, ఎలా తెలుసుకోవాలో తెలియని వారు ఈ కింది సూచనలు ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు, చాలా మంది మొదట సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందో లేదో తనిఖీ చేస్తారు. అలాగే దాని బరువును కూడా తనిఖీ చేస్తారు. కానీ సిలిండర్ గడువు తేదీని ఎప్పుడు అన్నది చెక్‌ చెయ్యరు. సిలిండర్​పైన గడువు తేదీ ఎక్కడ ఉంటుందంటే.. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్‌కు సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు కోడ్‌ రూపంలో A-12, B-23, C-15, D-28 ఇలా అంకెలు వేసి ఉంటాయి. ఈ కోడ్‌ ఎక్స్‌పైరీ సంవత్సరం, నెల వివరాలు సూచిస్తాయి. ఈ కోడ్‌ను డీకోడ్‌ చేయడం కూడా చాలా సులువు. ఎలాగంటే.జ

  • A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గడువు ఉంటుందని అర్ధం
  • B అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు గడువు ఉంటుందని అర్ధం
  • C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు గడువు ఉంటుందని అర్ధం
  • D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు గడువు ఉంటుందని అర్ధం

మీరు కొనుగోలు చేసిన సిలిండర్‌పై A-26 అని రాసి ఉంటే.. మీ సిలిండర్ గడువు 2026 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్య ముగుస్తుందని అర్థం. అలాగే D-24 అని వ్రాసినట్లయితే, 2024 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సిలిండర్ గడువు ముగుస్తుందని అర్థం అన్నమాట. ఈ విధంగా మీరు మీ సిలిండర్‌ గడువు తేదీని తెలుసుకోవచ్చు. సాధారణంగా LPG గ్యాస్ సిలిండర్ జీవితకాలం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇలా గడువు తేదీలను చూసి గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.