LIC Jeevan Shanti: ఏడాదికి రూ. లక్షపెన్షన్.. ఈ పథకంతో సాధ్యం.. ఒకేసారి పెట్టుబడి.. నెల నెలా రాబడి..
ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు. అంటే యాన్యుటీ ప్లాన్లన్నమాట. ఎల్ఐసీలో ఈ తరహా ప్లాన్ ఒకటి ఉంది. దాని పేరు ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే ప్రజలకు గొప్ప భరోసా. అందుకే దీనిలో ప్లాన్ తీసుకోడానికి, పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం సంకోచించరు. అంత నమ్మకం ప్రజల్లో ఎల్ఐసీపై ఉంది. అందుకు తగినట్లుగానే సంస్థ కూడా ప్రజాప్రయోజనకరమైన అనేక స్కీమ్లను అందిస్తుంటుంది. అన్ని వయసుల వారికి, ఏ విధంగా కావాలంటే ఆ విధమైన ప్రయోజనలతో కూడిన ప్లాన్లు అందిస్తుంటుంది. నెలవారీ పెట్టుబడి అయినా.. వార్షిక పెట్టుబడి అయినా.. నెలవారీ పెన్షన్ కావాలన్నా దీనిలో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు. అంటే యాన్యుటీ ప్లాన్లన్నమాట. ఎల్ఐసీలో ఈ తరహా ప్లాన్ ఒకటి ఉంది. దాని పేరు ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భవిష్యత్తు అవసరాలకు..
మీరు పనిచేయగలిన సమయంలో.. మీ వద్ద డబ్బు నిల్వ ఉన్న సమయంలో ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టగలిగితే.. మీరు రిటైర్ అయ్యాక, వయసు మీద పడిన సమయంలో ఎటువంటి చింతా లేకుండా నెల నెలా మీకు ఇది ఆదాయాన్ని అందిస్తుంది. ఇది భవిష్యత్తు అవసరాల కోసం ఒక నిధిని పొందేందుకు దోహదం చేస్తుంది. అంతే కాక ఈ ప్లాన్ మిమ్మల్ని డివిడెండ్‌లు లేదా వడ్డీ వంటి ఆదాయాలపై సంవత్సరానికి పన్ను విధించకుండానే మీ డబ్బును వృద్ధి చేస్తాయి. ఈ పన్ను లేకపోవడంతో పొదుపులను కాలక్రమేణా వేగంగా వృద్ధి చేయగలగుతుంది. దీనికి ఎటువంటి గరిష్ట పరిమితులు ఉండవు. ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది సాయం చేస్తుంది.
జీవన్ శాంతి ప్లాన్..
ఈ ఎల్‌ఐసీ పాలసీకి 30 నుంచి 79 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఇది ఎలాంటి రిస్క్ కవర్‌ను అందించదు. అయినప్పటికీ దాని ప్రయోజనాలు చాలా ఆసక్తిని కలుగజేస్తాయి. ఈ ఎల్ఐసీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ అందించిన రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ. దీని అర్థం మీరు మీ కోసం ఒక ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మీరు కావాలనుకుంటే వేరొకరితో కలిపి ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.
జీవన్ శాంతితో రూ.1 లక్ష పెన్షన్..
ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకం అనేది యాన్యుటీ ప్లాన్, దీనిలో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా స్థిరమైన పెన్షన్ పరిమితిని పొందవచ్చు. ఉదాహరణకు, 55 ఏళ్ల వ్యక్తి ఈ ప్లాన్‌లో రూ. 11 లక్షలు పెట్టుబడి పెట్టి, దానిని ఐదేళ్ల పాటు ఉంచుకుంటే, వారు ఏటా రూ. 1,01,880 సంపాదించవచ్చు. ప్రతి ఆరు నెలలకు పెన్షన్ మొత్తం 49,911 రూపాయలు, నెలవారీ ప్రాతిపదికన, ఇది 8,149 రూపాయలు ఉంటుంది. యాన్యుటీ ప్లాన్‌లో డెత్ బెనిఫిట్‌తో వస్తాయి. ఇది పాలసీదారు అనుకోని సందర్భంలో మరణిస్తే లబ్ధిదారునికి చెల్లింపునకు హామీ ఇస్తుంది. ఈ ఫీచర్ ప్రియమైన వారికి ఆర్థిక రక్షణను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..