Senior Citizen’s Savings Scheme: ఆ పథకానికి కొత్త మార్గదర్శకాలొచ్చాయ్.. తెలుసుకోకపోతే నష్టపోతారు..
ప్రధానంగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకాలు చాలా పాపులర్. ఈ మూడు పథకాలకు ప్రజల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాల్లో కొన్ని మార్పులు చేసింది. అవి తెలుసుకోకపోతే ఇబ్బందులు పడతారు.

మన దేశంలో ప్రభుత్వ భరోసా ఉండే పథకాలపై ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఎందుకంటే అందులో పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయని అందరి నమ్మకం. వాటిల్లో ప్రధానంగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకాలు చాలా పాపులర్. ఈ మూడు పథకాలకు ప్రజల నుంచి అధిక డిమాండ్ ఉంటుంది. వీటిల్లో ప్రజలకు అధిక వడ్డీ తో పాటు కచ్చితమైన రాబడిని పొందుతారు. అందుకే ప్రజల్లో వీటిల్లో అధికంగా పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాల్లో కొన్ని మార్పులు చేసింది. వాటి గురించి తెలుసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)లో ప్రభుత్వం చేసి మార్పుల గురించి తెలుసుకుందాం..
సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)..
ఇది ప్రభుత్వ భరోసాతో నడిచే రిటైర్ మెంట్ బెనిఫిట్ స్కీమ్. దీనిలో సీనియర్ సిటిజెన్స్ పలు పన్ను ప్రయోజనాలను పొందుతూ రైటైర్ మెంట్ తర్వాత క్వార్టర్లీ నగదు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతాను సింగిల్ అయినా లేదా జాయింట్ గా అయినా ప్రారంభించవచ్చు.
మారిన రూల్స్ ఇవే..
ఎక్స్‌టెన్షన్‌కు పరిమితి లేదు.. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) ఎక్స్ టెన్షన్ సమయంలో ఎటువంటి పరిమితి లేదని ప్రకటించింది. ఖాతాదారుడు అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత ఐదేళ్ల మెచ్యూరిటీ తీరిన తర్వాత తిరిగి మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ టెన్షన్ ఒకసారి మాత్రమే చేసుకోవచ్చు. ఎక్స్ టెన్షన్ మొత్తానికి కూడా వడ్డీ వస్తుంది.
విత్ డ్రా రూల్స్.. కొత్త మార్గదర్శకాల ప్రకారం మీరు ఖాతాను మెచ్యూరిటీ కన్నా ముందే అంటే ఖాతా ప్రారంభించిన ఒక ఏడాది లోపు క్లోజ్ చేయాలని భావిస్తే ఒకశాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే పాత రూల్స్ ప్రకారం ఒక ఏడాది లోపు ఖాతా మూసేయాలని భావిస్తే దానిపై ఎటువంటి వడ్డీ ఇచ్చే వారు కాదు. ఇప్పుడు వడ్డీ ఇస్తారు కానీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పెట్టుబడి పరిమితి.. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్)లో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 30లక్షల వరకూ పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ కొత్త మార్గదర్శకాలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టుకుంటే డిపాజిటర్లకు మేలు జరుగుతుంది. లేకపోతే అవనసరంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీ ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..