AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

investment: సెక్యూరిటీకి సెక్యూరిటీ.. ఆదాయానికి ఆదాయం. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌..

ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌లో ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్‌పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ క్రమంలోనే గత ఏప్రిలోలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1, 2023న పోస్టాఫీస్‌ టైమ్‌...

investment: సెక్యూరిటీకి సెక్యూరిటీ.. ఆదాయానికి ఆదాయం. పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్‌..
Post Office Scheme
Narender Vaitla
|

Updated on: Nov 16, 2023 | 8:01 PM

Share

ప్రతీ మనిషి తాను సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. అందుకోసమే ఎంత కష్టమైనా ఖర్చులను తగ్గించుకొని మరీ పొదుపు చేస్తుంటారు. అయితే పొదుపు చేసిన ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో భాగంగా సెక్యూరిటీతో పాటు, మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు.

ఇలాంటి వారి కోసమే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌లో ఒక మంచి పథకం అందుబాటులో ఉంది. పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్‌పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ క్రమంలోనే గత ఏప్రిలోలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1, 2023న పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. 7 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు.

ఈ పథకంలో భాగంగా కస్టమర్లు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, 5 ఏళ్లు పాటు డబ్బును డిపాజిట్‌ చేయవచ్చు. ఒక ఏడాదిపాటు పెట్టుబడి పెడితే 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. లేదా 2 నుంచి మూడేళ్లు పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ పొందొచ్చు. ఇకపోతే ఒకవేళ 5 ఏళ్లు పెట్టుడితే గరిష్టంగా 7.5 శాతం వడ్డీని పొందొచ్చు. పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావాలంటే కస్టమర్లు ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. అతనికి ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ వరకు ఉంచితే డిపాజిట్‌పై రూ. 2,24,974 వడ్డీని పొందొచ్చు. పెట్టిన పెట్టుబడితో కలిపితే ఈ మొత్తం.. రూ. 7,24,974కి చేరుతుంది. ఇక ఈ స్కీమ్‌ ద్వారా ఆదాయపు పన్ను శాఖ చట్టం 1961లోని సెక్షన్‌ 80సీ కింద కస్టమర్లు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందులో సింగిల్‌ ఖాతా లేదా, జాయింట్‌ ఖాతా ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లల ఖాతాను అతని కుటుంబ సభ్యులు ఓపెన్‌ చేయొచ్చు. ఇందుకోసం రూ. 1000తో ఖాతా తెరవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
శని నక్షత్రంలో సూర్యుడు.. వీరికి పండుగే పండుగ.. శుభవార్తలే..
శని నక్షత్రంలో సూర్యుడు.. వీరికి పండుగే పండుగ.. శుభవార్తలే..
RRB సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ 2026 విడుదల
RRB సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ 2026 విడుదల
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం
శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం
క్లాస్‌రూమ్‌లో కనిపించిన సీన్ చూసి జడుసుకున్న విద్యార్థులు!
క్లాస్‌రూమ్‌లో కనిపించిన సీన్ చూసి జడుసుకున్న విద్యార్థులు!
పిల్లల గదిని ఇలా అలంకరిస్తే మంచిది.. కానీ ఈ వస్తువులు మాత్రం..
పిల్లల గదిని ఇలా అలంకరిస్తే మంచిది.. కానీ ఈ వస్తువులు మాత్రం..
పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
జుట్టు ఊడదు.. పైగా కుదుళ్లు బలంగా మారతాయ్.. పూర్వీకుల చిట్కా ఇదే
జుట్టు ఊడదు.. పైగా కుదుళ్లు బలంగా మారతాయ్.. పూర్వీకుల చిట్కా ఇదే