AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పెళ్లి మండపంలోనే క్రికెట్‌ వీక్షణ.. వరుడు చేసిన పనికి అందరూ షాక్‌!

వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ అభిమానులకు అవదులు లేకుండా చేసింది. దీంతో ఓ యువకుడు తన పెళ్లికి ఓ వినూత్న అలోచనను అమలు చేశాడు. పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు క్రికెట్ వీక్షించే అవకాశం మిస్ కాకుండా వరుడు బలే ప్లాన్ వేశాడు. కళ్యాణ మండపంలోనే బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మరీ క్రికెట్ వీక్షించే అవకాశం కల్పించాడు. వరంగల్ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో హాట్ టాపిక్ గా మారిన క్రికెట్ బిగ్ స్క్రీన్‌ను మీరూ కూడా చూడండి..

Watch: పెళ్లి మండపంలోనే క్రికెట్‌ వీక్షణ.. వరుడు చేసిన పనికి అందరూ షాక్‌!
Led Screen At Marraige
G Peddeesh Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 19, 2023 | 9:09 PM

Share

వరంగల్ , నవంబర్ 19: వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్ అభిమానులకు అవదులు లేకుండా చేసింది. దీంతో ఓ యువకుడు తన పెళ్లికి ఓ వినూత్న అలోచనను అమలు చేశాడు. పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్, బంధువులు క్రికెట్ వీక్షించే అవకాశం మిస్ కాకుండా వరుడు బలే ప్లాన్ వేశాడు. కళ్యాణ మండపంలోనే బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మరీ క్రికెట్ వీక్షించే అవకాశం కల్పించాడు. వరంగల్ జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో హాట్ టాపిక్ గా మారిన క్రికెట్ బిగ్ స్క్రీన్‌ను మీరూ కూడా చూడండి.

క్రికెట్ మ్యాచ్ అనగానే పనులన్ని పక్కన పెట్టి గ్రూప్ గా స్నేహితులతో కొందరు, ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని కనురెప్ప ఆర్పకుండా చూసే కొందరు.. స్మార్ట్ ఫోన్లలో వీక్షించే వారు మరికొందరు ఉంటారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా వరంగల్ జల్లాలోని పెళ్లి వేడుకలో బిగ్ స్క్రీన్ పై క్రికెట్ విక్షించడం జనంలో చర్చగా మారింది

ఇవి కూడా చదవండి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కత్తి శివ అనే యువకుడి వివాహం మమునూరు సమీపంలోని HRS గార్డెన్ లో జరిగింది. వివాహం జరుగుతుండగా వచ్చిన బంధువులకు పెళ్లిలో స్పెషల్ ఏర్పాట్లు చేశాడు. క్రికెట్ అభిమానంతో LED బిగ్ స్క్రీన్ పెట్టి క్రికెట్ లైవ్ వీక్షించే అవకాశం కల్పించారు. పెళ్లి కి వచ్చిన వారంతా క్రికెట్ మోజులోనే మునిగి పోయారు. తన పెళ్లికి వచ్చిన బంధువులకు క్రికెట్ – పెళ్లి రెండూ మిస్ కాకుండా చేసిన పెళ్లి కుమారుడి ఆలోచనను ప్రతి ఒక్కరూ శభాష్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.