Heart Attack: గుండెపోటుతో బీటెక్ విద్యార్ధిని మృతి.. తరగతి గదిలోనే కుప్పకూలిన వైనం!
వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో అనేక మంది గుండెపోటుతో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. జిమ్‌లలో కసరత్తులు చేస్తూ, పండుగలు-సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలు ఎన్నో చూశాం. చివరికి రోడ్లపై నడుస్తున్న వారు వెళ్తూ.. వెళ్తూ.. ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. బీటెక్ విద్యార్ధిని తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో తోటి విద్యార్ధులు, కాలేజీ యాజమన్యం హుటాహుటీన..
రాజన్న సిరిసిల్లా, నవంబర్ 17: వయసుతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో అనేక మంది గుండెపోటుతో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. జిమ్‌లలో కసరత్తులు చేస్తూ, పండుగలు-సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలు ఎన్నో చూశాం. చివరికి రోడ్లపై నడుస్తున్న వారు వెళ్తూ.. వెళ్తూ.. ఇలా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటన మరొకటి వెలుగు చూసింది. బీటెక్ విద్యార్ధిని తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో తోటి విద్యార్ధులు, కాలేజీ యాజమన్యం హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన బీటెక్ విద్యార్ధిని గెంట్యాల ప్రదీప్తి(18) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. మంగళవారం (నవంబర్ 14న) కాలేజీకి వెళ్లిన ప్రదీప్తి(18) గుండెపోటుకు గురైంది. కాలేజీలోని తరగతి గదిలో ఉన్నట్లుండి ప్రదీప్తి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్ధినిన గురువారం మృతి చెందింది. ప్రదీప్తి మరణంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యార్ధిని మృతదేశాన్ని అంబులెన్స్‌లో సిరిసిల్లలోని స్వగృహానికి తరలించారు. చిన్న వయసులోనే ఇంజినీరింగ్ విద్యార్థిని గుండెపోటుతో మరణించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
కాగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోట్లు అధికమవుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ లేకపోవటం, ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల గుండె జబ్బులకు దారి తీస్తున్నట్లు తెలిపారు. గతంలో 50 యేళ్లు దాటిన వారు గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు. కానీ నేటికాలంలో 5 యేళ్ల పసికందుకు కూడా గుండె పోటు వస్తోంది. ఇదే నెలలో గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి నగరంలో పరీక్ష రాసేందుకు పరీక్ష హాలులోకి వెళ్లున్న 9వ తరగతి విద్యార్ధిని అక్కడికక్కడే గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. పాఠశాలకు వెళ్లే విద్యార్థినికి గుండెపోటు రావడమేంటని అంతా షాక్‌కు గురయ్యారు. పరీక్ష రాసేందుకు హాలులోకి వెళ్తున్న విద్యార్ధిని స్పృహతప్పి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.