Telangana: తెలంగాణలో ఆసక్తికర పోరు.. ఒకే ప్రత్యర్థిపై కుటుంబం మొత్తం పోటీ..

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మారడం కామన్, పార్టీలు మారడం ఇంకా కామన్, వారసులు రాజకీయాలకు రావడం కూడా సహజమే. కానీ ఇవన్నీ జరిగిన ఒక కుటుంబానికి మాత్రం ఒక వ్యక్తి ప్రత్యర్థి. 2004 నుంచి 19 ఏళ్లుగా ఆ ప్రత్యర్థి పైనే కుటుంబం మొత్తం పోటీ చేస్తుంది. ఇప్పుడు మెదక్ నియోజకవర్గం ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గం. 2004లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రామాయంపేట ఒక నియోజకవర్గంగా...

Telangana: తెలంగాణలో ఆసక్తికర పోరు.. ఒకే ప్రత్యర్థిపై కుటుంబం మొత్తం పోటీ..
Telangana
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Narender Vaitla

Updated on: Nov 17, 2023 | 5:41 PM

తెలంగాణ రాజకీయాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఒకే ప్రత్యర్థిపై 19 ఏళ్లుగా ఒక కుటుంబం మొత్తం పోరాడుతోంది. తల్లి,తండ్రి ఇప్పుడు కొడుకు… వరుసగా పోటీపడుతున్న ఆ ప్రత్యర్థి ఎవరు? ఆ నియోజకవర్గంలో ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

రాజకీయాల్లో ప్రత్యర్ధులు మారడం కామన్, పార్టీలు మారడం ఇంకా కామన్, వారసులు రాజకీయాలకు రావడం కూడా సహజమే. కానీ ఇవన్నీ జరిగిన ఒక కుటుంబానికి మాత్రం ఒక వ్యక్తి ప్రత్యర్థి. 2004 నుంచి 19 ఏళ్లుగా ఆ ప్రత్యర్థి పైనే కుటుంబం మొత్తం పోటీ చేస్తుంది. ఇప్పుడు మెదక్ నియోజకవర్గం ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గం. 2004లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రామాయంపేట ఒక నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పద్మ దేవేందర్ రెడ్డి పోటీలో నిలుచున్నారు.

ఆమెకు ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి మైనంపల్లి వాణి బరిలో ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు భార్య అయిన వాణి ఓడిపోయి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2008లో అదే పద్మాదేవేందర్ రెడ్డి పై బరిలోకి దిగిన మైనంపల్లి హనుమంతరావు గెలుపొందారు. 2009లో మరోసారి ఇదే పద్మాదేవేందర్ రెడ్డి పై గెలుపొందారు మైనంపల్లి. ఇక 2014, 2018లలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి వరుసగా గెలిచారు.

ఇప్పుడు మళ్లీ మైనంపల్లి కుటుంబంపై పద్మా దేవేందర్ రెడ్డిపై పోటీలో ఉన్నారు, వారి వారసుడు మైనంపల్లి రోహిత్. ప్రత్యర్థి ఒకరి పద్మాదేవేందర్ రెడ్డి… కానీ 2004లో తల్లి వాణి 2008, 2009లో తండ్రి మైనంపల్లి హనుమంతరావు , ఇప్పుడు తాజాగా తనయుడు మైనంపల్లి రోహిత్… అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రెండు కుటుంబాల మధ్య గెలుపు ఓటములు తారుమారవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈసారి రోహిత్ బరిలో ఉండడంతో మెదక్ నియోజకవర్గం ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 19 ఏళ్ల రాజకీయ సమరంలో ఈసారి ఏ కుటుంబం నెగ్గుతుంది అనేది బెట్టింగ్‌లకు దారితీస్తుంది. మరోవైపు ఇదే పోరు హరీష్ వర్సెస్ మైనంపల్లిగా కూడా కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..