Vijayashanti: ఎన్నికలకు ముందు హస్తం పార్టీలో జోష్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి..

తెలంగాణలో అసెంబ్లీ సందడి నెలకొంది.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా అధికారంలోకి రావలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం.. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. అంతేకాకుండా.. మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. ఓ వైపు రాష్ట్ర నేతలు.. మరోవైపు జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకగాంధీ.. కూడా ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు.

Vijayashanti: ఎన్నికలకు ముందు హస్తం పార్టీలో జోష్.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి..
Vijayashanti
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2023 | 6:11 PM

తెలంగాణలో అసెంబ్లీ సందడి నెలకొంది.. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైనా అధికారంలోకి రావలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ సైతం.. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి వెళ్తోంది. అంతేకాకుండా.. మేనిఫెస్టోను సైతం విడుదల చేసింది. ఓ వైపు రాష్ట్ర నేతలు.. మరోవైపు జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకగాంధీ.. కూడా ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. ఈ తరుణంలో ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి రాజీనామా చేసిన విజయశాంతి.. కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. తాజ్‌కృష్ణాలో ఖర్గేతో భేటీ అయిన విజయశాంతి.. పలు విషయాలపై చర్చించారు.

కాగా.. అసంతృప్తి ఉన్నప్పటికీ.. బీజేపీలో కొనసాగిన విజయశాంతి బుధవారం (నవంబర్ 15) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. అయితే, ఇటీవల మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు విజయశాంతి ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లారు. అదేరోజున కాంగ్రెస్ నేతలు విజయశాంతి పార్టీ మారుతున్నారని.. కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రకటించారు. దీనిపై స్పందించిన విజయశాంతి పార్టీ మార్పు లేదంటూ అదేరోజు ఖండించారు. ఆ వెంటనే రెండురోజుల్లో బీజేపీకి రాజీనామా చేయడం ఆపార్టీలో కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..