Telangana Elections: చిదంబర చిచ్చు.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలకు కారణమెవరు?

Big News Big Debate: తెలంగాణలో మరోసారి సెంట్‌మెంట్ రాజుకుంది. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రచ్చ రాజేశాయి. హత్య చేసిన హంతకుడే క్షమాపణ చెప్పినట్టుగా ఉందని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని.. తొలి, మలి దశ ఉద్యమాల్లో వందల మంది యువకులను బలితీసుకున్న చరిత్ర మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకుందని విమర్శిస్తోంది బీజేపీ. ఇక తెలంగాణతో మాది రక్తసంబంధమని రాహుల్‌ అంటే.. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసిన దుర్మార్గం కాంగ్రెస్‌ పార్టీదన్నారు సీఎం కేసీఆర్‌.

Telangana Elections: చిదంబర చిచ్చు.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలకు కారణమెవరు?
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2023 | 6:39 PM

Big News Big Debate: తెలంగాణలో మరోసారి సెంట్‌మెంట్ రాజుకుంది. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రచ్చ రాజేశాయి. హత్య చేసిన హంతకుడే క్షమాపణ చెప్పినట్టుగా ఉందని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని.. తొలి, మలి దశ ఉద్యమాల్లో వందల మంది యువకులను బలితీసుకున్న చరిత్ర మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకుందని విమర్శిస్తోంది బీజేపీ. ఇక తెలంగాణతో మాది రక్తసంబంధమని రాహుల్‌ అంటే.. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసిన దుర్మార్గం కాంగ్రెస్‌ పార్టీదన్నారు సీఎం కేసీఆర్‌.

ఎన్నికలు ఏవైనా తెలంగాణ సెంటిమెంట్ అజెండాలో ఉండాల్సిందే.. తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరం సెంటిమెంట్‌లో కొత్త కోణాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. ప్రజాఉద్యమం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని.. అయితే యువకుల బలిదానాలు దురదృష్టకరమని ఇందుకు క్షమాపణ అడుగుతున్నామన్నారు చిదంబరం. సీనియర్‌ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

హంతకుడే సంతాపం తెలిపిన‌ట్టుగా చిదంబరం తీరు ఉందన్నారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన చిదంబరం.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్లే యువకులు బలిదానాలు జరిగాయన్నారు. యువత ప్రాణాలు బలితీసుకున్న నరహంతక పార్టీని ఎందుకు క్షమించాలని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పడానికి గాంధీలకు నోరు రాక బంట్రోతులను పంపిస్తున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

1969లో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చిచంపిన చరిత్రతో పాటు, మలిదశ ఉద్యమంలోనూ 12వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమంటోంది బీజేపీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని.. 4 కోట్ల మంది సకలజనులు ఆందోళన చేసి, కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి..

ఎన్నికల వేళ మరోసారి సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఇచ్చామని హస్తం పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే.. బలిదానాలకు కారణమైందని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరి మాటలకు పట్టం కట్టబోతున్నారు?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!