Sanjay Gadhvi: ‘ధూమ్‌’ సినిమా డైరెక్టర్‌ కన్నుమూత.. కారణం ఇదే!

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకున్న 'ధూమ్‌' మువీ దర్శకుడు సంజయ్‌ గాధ్వి (56) హార్ట్‌ ఎటాక్‌తో కన్నుమూశారు. ముంబయిలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన పెద్దకుమార్తె సంజినా మీడియాకు తెలిపారు. సంజయ్‌ గాధ్వి మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. గాధ్వీ 57వ పుట్టిన రోజు జరుపుకున్న మూడు రోజుల వ్యవధిలోనే మృతి..

Sanjay Gadhvi: 'ధూమ్‌' సినిమా డైరెక్టర్‌ కన్నుమూత.. కారణం ఇదే!
'dhoom' Director Sanjay Gadhvi Died
Follow us

|

Updated on: Nov 19, 2023 | 3:23 PM

ముంబై, నవంబర్ 19: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకున్న ‘ధూమ్‌’ మువీ దర్శకుడు సంజయ్‌ గాధ్వి (56) హార్ట్‌ ఎటాక్‌తో కన్నుమూశారు. ముంబయిలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన పెద్దకుమార్తె సంజినా మీడియాకు తెలిపారు. సంజయ్‌ గాధ్వి మృతితో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. గాధ్వీ 57వ పుట్టిన రోజు జరుపుకున్న మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో హిందీ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

గాంధ్వీ కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. గాంధ్వీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఉన్నట్లుండి ఈ రోజు ఉదయం 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయి ఉంటారని గాంధ్వీ కుమార్తె సంజిని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం. గాంధ్వీకి భార్య, సంజినితో పాటు మరో కుమార్తె కూడా ఉంది.

ఆయన సినీ కెరీర్ విషయానికొస్తే.. బాలీవుడ్‌ నాట 2000లో విడుదలైన ‘తేరే లియే’తో సంజయ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మువీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత 2004లో విడుదలైన ‘ధూమ్‌’తో ఆయన తొలి విజయాన్ని అందుకున్నారు. విడుదలైన అన్ని భాషల్లో హిట్‌ టాక్‌ అందుకుంది. ఆ తర్వాత 2006లో ‘ధూమ్‌ 2’ విడుదలైంది. ఈ మువీ కూడా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. 2020లో విడుదలైన ‘ఆపరేషన్ పరిందే’ చిత్రం తర్వాత ఆయన మళ్లీ ఏ సినిమాకు పనిచేయలేదు. గతకొంతకాలంగా చిత్రపరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కుర్ర హీరోల నుంచి వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికే పలువురు హార్ట్‌ ఎటాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్