- Telugu News Photo Gallery Cinema photos Rowdy Boy Vijay devarakonda family star Movie coming or Not to sankranti 2023 details here Telugu Heroes Photos
Vijay Devarakonda – Family Star: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి రాదా..? అలా చేస్తే ఎలా.?
అదేంటి అంత మాట అనేసారు.. దిల్ రాజు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు కదా నా సినిమా సంక్రాంతికి వస్తుంది అని.. మళ్లీ ఇప్పుడు ఈ డౌట్స్ ఏంటి అనుకుంటున్నారు కదా..? నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది చెప్పండి..? విజయ్ దేవరకొండ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగానే జరుగుతుంది. సంక్రాంతికి ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంకణం కట్టుకున్నాడు విజయ్.
Praveen Vadla | Edited By: Anil kumar poka
Updated on: Nov 19, 2023 | 4:55 PM

అదేంటి అంత మాట అనేసారు.. దిల్ రాజు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు కదా నా సినిమా సంక్రాంతికి వస్తుంది అని.. మళ్లీ ఇప్పుడు ఈ డౌట్స్ ఏంటి అనుకుంటున్నారు కదా..? నిప్పు లేకుండా పొగ ఎందుకు వస్తుంది చెప్పండి..? విజయ్ దేవరకొండ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగానే జరుగుతుంది.

సంక్రాంతికి ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని కంకణం కట్టుకున్నాడు విజయ్. అందుకే దీనికంటే ముందు మొదలు పెట్టిన గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా పక్కనబెట్టి ఫ్యామిలీ స్టార్ పూర్తి చేస్తున్నాడు. పరశురామ్ కూడా ఈ సినిమాపై బాగానే ఫోకస్ చేస్తున్నాడు.

సర్కారు వారి పాట యావరేజ్‌గానే నిలవడం.. ఆ మధ్య మనోడిపైన బాగానే కాంట్రవర్సీలు రావడంతో పరశురామ్ కెరీర్‌కు కీలకంగా మారింది ఫ్యామిలీ స్టార్. మొన్న విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. దానికితోడు సోషల్ మీడియాలో ఐరెనే వంచాలా ఏంటి అనే లైన్ కూడా బాగా పేలింది.

దాంతో దెబ్బకు సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంతా బాగానే ఉంది కానీ సంక్రాంతికి రాకుండా ఉండటానికి గల కారణాలేంటి అనుకోవచ్చు..? అక్కడికే వస్తున్నాం.. నిజానికి ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి నాటికి పూర్తవుతుంది. డిసెంబర్‌లోనే షూట్ పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేయడం పెద్ద సమస్య కూడా కాకపోవచ్చు.

పైగా దిల్ రాజు ఉన్నాడు కాబట్టి థియేటర్స్ ఇష్యూ కూడా ఉండదు. కానీ ఆయన చేతుల్లో కూడా లేని ఓ విషయం ఫ్యామిలీ స్టార్‌ను ఇబ్బంది పెడుతుంది. అదే ఓటిటి.. సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్, ఈగల్ అంటూ ఆల్రెడీ అరడజన్ సినిమాలు వస్తున్నాయి.

ఇదే టైమ్‌లో ఫ్యామిలీ స్టార్ కూడా వస్తే.. కచ్చితంగా కలెక్షన్లు పంచుకోవాల్సి వస్తుంది. అది కూడా పక్కనబెడితే ఈ సినిమాల డిజిటల్ రిలీజ్‌లన్నీ ఒకేసారి ఉంటాయి. నెల రోజుల తర్వాత అటూ ఇటూగా ఒకేసారి ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తాయి. అలా చేస్తే వ్యూవర్ షిప్‌పై దెబ్బ పడుతుందని ఓటిటి సంస్థలు భయపడుతున్నాయి.

విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి కనీసం 30 కోట్ల వరకు రేట్ పలుకుతుంది. అలాంటప్పుడు పోటీ లేని సమయంలో రిలీజ్ చేస్తేనే దానికి వ్యూవర్ షిప్ ఉంటుంది. ఒకేసారి అన్ని సంక్రాంతి సినిమాలతో పాటు వస్తే ప్రభావం భారీగా ఉంటుంది.

అందుకే సంక్రాంతికి సినిమా విడుదల కాకుండా ఆపి.. మార్చికి విడుదల చేయాలని నిర్మాతలకు సూచిస్తున్నాయి ఓటిటి సంస్థలు. దిల్ రాజు సైతం దీనికి ఓకే అన్నట్లు తెలుస్తుంది. అదే కానీ జరిగితే పండక్కి కాకుండా.. సమ్మర్‌కు ముందు ఫ్యామిలీ స్టార్ బరిలోకి దిగుతాడు.





























