Sabarimala Special Trains: శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయో ఫుల్‌ లిస్ట్‌ ఇదే

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో.. సికింద్రాబాద్‌-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07129/07130) సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. నవంబర్‌ 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తిరుగు

Sabarimala Special Trains: శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయో ఫుల్‌ లిస్ట్‌ ఇదే
special trains for Sabarimala pilgrims
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 21, 2023 | 7:00 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 21: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మార్గంలో 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

  • నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో.. సికింద్రాబాద్‌-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07129/07130) సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. నవంబర్‌ 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తిరుగు ప్రయాణం (కొల్లం-సికింద్రాబాద్‌) ఉంటుంది. తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్‌ చేరుకోనుంది.
  • నర్సాపూర్‌-కొట్టాయం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07119/07120) నవంబర్‌ 26, డిసెంబరు 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొట్టాయం-నర్సాపూర్‌) నవంబర్‌ 27, డిసెంబర్‌ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9కి నర్సాపూర్‌కు చేరుకుంటుంది.
  • కాచిగూడ-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07123/07124) నవంబర్‌ 22, 29, డిసెంబరు 6 తేదీల్లో సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొల్లం-కాచిగూడ) నవంబర్‌ 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకి కాచిగూడ చేరుకుంటుంది.
  • కాకినాడ-కొట్టాయం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07125/07126) ఈ నెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకి కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొట్టాయం-కాకినాడ) నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 12.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
  • సికింద్రాబాద్‌-కొల్లం (స్పెషల్‌ ట్రైన్‌ నెంబర్‌ 07127/07128) నవంబర్‌ 24, డిసెంబరు 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకి బయల్దేరి మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (కొల్లం-సికింద్రాబాద్‌) నవంబర్‌ 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 11కి బయల్దేరి రెండవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ఈ ట్రైన్‌లన్నింటికీ ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని తన ప్రకటనలో తెల్పింది. రైళ్లను నడిపించడంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ స్పష్టం చేశారు. విధుల్లో పాల్గొనే లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకో పైలట్లతో పాటు రైళ్ల కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బందికి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.