Most Expensive Whiskey: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ సీసా.. ధర ఏకంగా రూ.22.5 కోట్లు!
ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ విస్కీ బాటిల్ అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చరపరిచింది. దాదాపు 97 ఏళ్ల క్రితం మెకలాన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీ.. వేలం పాటలో దాదాపు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ అత్యంత ఎక్కువ ధర పలికి అందరినీ ఆశ్చపరిచింది. నవంబర్ 18 (శనివారం)న జరిగిన వేలంలో ఈ విస్కీ బాటిల్ ధర రూ.12 కోట్లు పలుకుతుందని నిపుణులు..
లండన్, నవంబర్ 20: ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ విస్కీ బాటిల్ అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చరపరిచింది. దాదాపు 97 ఏళ్ల క్రితం మెకలాన్ కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీ.. వేలం పాటలో దాదాపు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. మెకాలన్ బ్రాండ్‌కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ అత్యంత ఎక్కువ ధర పలికి అందరినీ ఆశ్చపరిచింది. నవంబర్ 18 (శనివారం)న జరిగిన వేలంలో ఈ విస్కీ బాటిల్ ధర రూ.12 కోట్లు పలుకుతుందని నిపుణులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఈ పురాతన విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. కాగా 2019లో ఇదే కంపెనీ తయారు చేసిన విస్కీ రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వేలంలో మకాలన్ కంపెనీ తన పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.
మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసింది. దీనిని ఏకంగా 60 ఏళ్లు డార్క్ ఓక్‌వుడ్ పెట్టెల్లో నిలవ చేసింది. 1986లో 40 బాటిళ్లలో నింపింది. కానీ ఈ కంపెనీ వీటన్నింటిని అమ్మకానికి ఉంచలేదు. వీటిల్లో కొన్ని బాటిళ్లను మెకలాన్‌కు వచ్చే వీఐపీ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రతి ఒక్క వేలం నిర్వాహకుడు ఈ రకమైన విస్కీని విక్రయించాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్క కొనుగోలుదారు దానిని స్వంతం చేసుకోవాలని అనుకుంటారని వేలం నిర్వహించిన సోత్‌బైస్ కంపెనీ నిర్వాహకులు తెలిపారు. మకాల్లన్ కంపెనీ తయారు చేసిన 40 బాటిళ్లలో రెండు బాటిళ్లకు ఇప్పటివరకు లేబుల్‌లు లేవు.
14 విస్కీ సీసాలు ప్రత్యేకమైన, అత్యంత అరుదైన లేబుల్‌లతో అలంకరించారు. మరో 12 బాటిళ్లను ఇంగ్లండ్‌కు చెందిన సర్ పీటర్ బ్లాక్ డిజైన్ చేశారు. మిగిలిన 12 విస్కీ బాటిళ్లకు సంబంధించిన లేబుళ్లను ప్రముఖ ఇటాలియన్ పెయింటర్ వాలెరియో అదామి రూపొందించారు. ప్రస్తుతం వేలంలో ఉన్న బాటిల్ కార్క్ చేసి లేబుల్‌తో అందుబాటులోకి తెచ్చారు. ఈ 40 విస్కీ బాటిళ్లలో 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం వల్ల ఒక సీసా ధ్వంసమైందని, మరొక బాటిల్ తెరచి తాగినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.