Telangana Elections: బలవంతంగా అయినా గౌరవం ఇవ్వాల్సి వస్తోంది.. కర్నాటక మంత్రి జమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Muslim Speaker Remark Row: తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా ప్రధాన పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దంగల్‌లో దుమారం రేపాయి. కర్నాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది.
Muslim Speaker Remark Row: తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని కూడా ప్రధాన పార్టీలు వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దంగల్‌లో దుమారం రేపాయి. కర్నాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. తెలంగాణ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. దీనికోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని.. ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కర్నాటక నేతలను కూడా దింపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక నేతలు చేస్తున్న కామెంట్స్ వివాదాన్ని రేపుతున్నాయి. అదే సమయంలో ప్రత్యర్ధిపార్టీలకు అస్త్రంగా మారుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్‌కి.. బీజేపీ నేతలు బలవంతంగా అయినా గౌరవం ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. ఓ ముస్లింకి బీజేపీ నేతలు నమస్కారం చెబుతున్నారంటే అదంతా కాంగ్రెస్ ఘనతే అంటూ తేల్చి చెప్పారు.
కర్నాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ఈ కామెంట్స్‌పై JDS తీవ్రంగా స్పందించింది. ఓ మంత్రి ఇంతలా దిగజారిపోయి మాట్లాడతారని ఊహించలేదంటూ మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కొంతైనా జ్ఞానం ఉంటే జమీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే తన ప్రకటనపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నష్టనివారణ చర్యలు చేపట్టారు జమీర్ అహ్మద్. తాను ముస్లిం వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడానని.. ఏ పార్టీ శాసనసభ్యులను అవమానించలేదంటూ పేర్కొన్నారు. మరోవైపు వచ్చేనెల మొదటి వారంలో కర్నాటక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..