AP Govt Jobs: నేడు పశు సంవర్ధక శాఖలో 1,896 వీఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి సోమవారం (నవంబర్ 20) పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి సోమవారం (నవంబర్ 20) పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. నెలకు వేతనం రూ.22,460 వరకు జీతంగా చెల్లిస్తారు. అయితే ఎంపికై తర్వాత మొదటి రెండేళ్లు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే చేస్తారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.22,460 చొప్పున జీతం ఇస్తారు. అభ్యర్థులు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. దరఖాస్తు రుసుము డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి.
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని ప్రభుత్వం గుర్తిచింది. దీంతో ఈ పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్ ద్వారా గ్రామ పరిధిలో 2,3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా ఏర్పరచి వీఏహెచ్‌ఏలను నియమించడం జరిగింది. అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. ఇక మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నేడు నోటిఫికేషన్ ఇవ్వనుంది.
జిల్లా వారీగా పోస్టుల వివరాలు..
- అనంతపురం జిల్లాలో పోస్టులు: 473
- చిత్తూరు జిల్లాలో పోస్టులు: 100
- కర్నూలు జిల్లాలో పోస్టులు: 252
- వైఎస్సార్ జిల్లాలో పోస్టులు: 210
- నెల్లూరు జిల్లాలో పోస్టులు: 143
- ప్రకాశం జిల్లాలో పోస్టులు: 177
- గుంటూరు జిల్లాలో పోస్టులు: 229
- కృష్ణా జిల్లాలో పోస్టులు: 120
- పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టులు: 102
- తూర్పు గోదావరి జిల్లాలో పోస్టులు: 15
- విశాఖపట్నం జిల్లాలో పోస్టులు: 28
- విజయనగరం జిల్లాలో పోస్టులు: 13
- శ్రీకాకుళం జిల్లాలో పోస్టులు: 34
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.