AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌.. అరెస్ట్!

బాధ్యతగల ఓ ప్రభుత్వ అధికారి ఆమె. కానీ పనుల నిమిత్తం ఆమె వద్దకు వచ్చిన ప్రజల వద్ద అడ్డగోలుగా లంచం తీసుకోవడం పరిపాటై పోయింది. లంచం లేనిదే పని జరిగే పరిస్థితి లేదనే అపనమ్మకం అక్కడి ప్రజానీకానికి ఏర్పడేలా సదరు అధికారి ప్రవర్తించారు. ఈ క్రమంలో తాజాగా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటన తెలంగాణలోని జనగామ మున్సిపల్‌ కమిషన్‌లో చోటుచోసుకుంది..

Telangana: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన జనగామ మున్సిపల్‌ కమిషనర్‌.. అరెస్ట్!
Janagama Municipal Commissioner
Srilakshmi C
|

Updated on: Nov 21, 2023 | 9:52 AM

Share

జనగామ, నవంబర్‌ 21: బాధ్యతగల ఓ ప్రభుత్వ అధికారి ఆమె. కానీ పనుల నిమిత్తం ఆమె వద్దకు వచ్చిన ప్రజల వద్ద అడ్డగోలుగా లంచం తీసుకోవడం పరిపాటై పోయింది. లంచం లేనిదే పని జరిగే పరిస్థితి లేదనే అపనమ్మకం అక్కడి ప్రజానీకానికి ఏర్పడేలా సదరు అధికారి ప్రవర్తించారు. ఈ క్రమంలో తాజాగా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడింది. ఈ ఘటన తెలంగాణలోని జనగామ మున్సిపల్‌ కమిషన్‌లో చోటుచోసుకుంది. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన చెట్టిపల్లి రాజు భవన నిర్మాణం చేపట్టాడు. అందుకు ముందుగా అధికారుల వద్ద అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై గత ఏడాది జూన్‌లో జనగామ కలెక్టరేట్‌ ఎదుట జీప్లస్‌-3 భవన నిర్మాణానికి అనుమతి పొందాడు. ఈ ఏడాది సెప్టెంబరులో భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం భవన నిర్మాణం జరిగింది. అలాగే 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్‌ కూడా చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్‌ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ సైతం తీసుకున్నారు.

అయితే మున్సిపాల్టీకి కుదువ పెట్టిన 10 శాతం స్థలాన్ని విడిపించి ఇవ్వాలని చెట్టిపల్లి రాజు భావించాడు. అందుకు మున్సిపల్‌ కమిషనర్‌ రజితకు దరఖాస్తు చేశారు. స్థలాన్ని విడిపించేందుకు రూ.60 వేలు ఇవ్వాలని కమిషనర్‌ రజిత డిమాండ్‌ చేశారు. అయితే రాజు రూ.40 వేలు మాత్రమే ఇచ్చుకోగలనని విన్నవించాడు. అనంతరం బయటికి వచ్చిన రాజు ఏసీబీ అధికారులను సంప్రదించారు. మున్సిపల్ కమిషనర్‌ తన వద్ద లంచం డిమాండ్ చేసిన సంగతి వారికి తెలిపారు. అనంతరం ఏసీజీ అధికారులు తాము చెప్పినట్లు చేయమని రాజుకు తెలిపారు. వారి సూచనల మేరకు రాజు రూ.40 వేలు తీసుకెళ్లాడు. అయితే నేరుగా తనకు ఇవ్వవద్దని తన డ్రైవర్‌ నవీన్‌కు ఇవ్వాలని రజిత సూచించారు. ఇంతలో నవీన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కమిషనర్‌ రజిత ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్‌ నవీన్‌ అధికారుల అంగీకరించాడు. దీంతో ఏసీబీ అధికారులు కమిషనర్‌ రజితను, డ్రైవర్‌ నవీన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.