Telangana Elections: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ.. జగిత్యాలలో మారిన సీన్.. త్రిముఖ పోరులో గెలిచెదెవరు..?
Jagtial Assemly Election: జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ తరుణంలో బీజేపీ వేగంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం ఇక్కడ త్రిముఖ పోరుగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు.. పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Jagtial Assemly Election: జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. ఈ తరుణంలో బీజేపీ వేగంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం ఇక్కడ త్రిముఖ పోరుగా మారింది. ఈ ముగ్గురు అభ్యర్థులు.. పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సంజయ్ కుమార్ కోసం కవిత ప్రచారం చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి శ్రావణీ కోసం అరవింద్ రంగంలోకి దిగారు. ఈ ఇద్దరు.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే. జీవన్ రెడ్డి మాత్రం.. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ త్రిముఖ పోరులో గెలుపును రాజకీయ శ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు.
జగిత్యాలలో రాజకీయ చైతన్యం ఎక్కువ..
జగిత్యాలలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఫలితాలపై రాజకీయ పండితులు స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు.. బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచీ భోగ శ్రావణి బరిలోకి దిగారు. అయితే.. మొదట, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని భావించారు.. అయితే, భోగ శ్రావణి.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడంతో పోరు రసవత్తరంగా మారింది.. శ్రావణి.. జగిత్యాల మునిసిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసి.. బీజేపీ కండువా కప్పుకున్నారు. సంజయ్ కుమార్.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయనకు సౌమ్యుడు అనే పేరు ఉంది. అదే విధంగా కవిత అండదండలు ఉన్నాయి. కవిత కూడా.. ఈ నియోజకవర్గంపై ఎక్కువగానే దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గంలో సంజయ్ కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు.. గత ఎన్నికల్లో 60 వేయలకు పైగా ఓట్ల మెజారిటితో.. సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇంత మెజారిటీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డితో తలపడుతున్నారు. తాగు, సాగునీటి సమస్య లేకుండా చేశానని చెబుతున్నారు.. అదేవిధంగా పూర్తిగా పారదర్శకవంతమైన పాలన అందించానని గుర్తు చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చేసిన తనకు రెండవసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోసారి ఆవకాశం ఇస్తే.. జగిత్యాలను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీనిస్తున్నారు. ఇప్పటికీ రెండు నెల నుంచి ప్రచారం చేస్తూ తన ప్రత్యర్థి జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
అయితే, జీవన్ రెడ్డి.. తనకు చివరి ఎన్నికలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆధికారంలోకి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే.. రాహుల్ గాంధీ జగిత్యాలలో పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రచార స్పీడ్ను పెంచారు. అదే విధంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేస్తూ.. గత ఎన్నికల్లో సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. స్థానిక సమస్యలను కూడా ప్రస్తాస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ 80కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. అంతేకాదు.. ఇక్కడ జీవన్ రెడ్డి సీఎం రేసులో కూడా ఉన్నారనే ప్రచారాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తుండగా.. దీనిని జీవన్ రెడ్డి కొట్టి పారేస్తున్నారు.
కాగా.. స్థానిక ఎంఎల్ఎ సంజయ్ కుమార్‌తో విభేధాల కారణంగా.. మున్సిపల్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. తరువాత బీజేపీలో చేరారు భోగ శ్రావణి.. ఇక్కడ బీసి నినాదంతోపాటు.. మహిళ అభ్యర్థిగా ఆదరించాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా బిసి ఓట్ల పై ఫోకస్ పెట్టారు. ఇలా నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి.. ఇప్పటికే రెండు విడతల్లో పర్యటించారు. ఇలా త్రిముఖ పోరులో.. తమదే జయమనే ధీమాతో బిజేపీ అభ్యర్థి ముందుకు సాగుతున్నారు.
ఇలా జగిత్యాలలో పోరు రసవత్తరంగా మారింది. అన్ని వర్గాల ప్రజలకు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని బిఆర్ఎస్ అభ్యర్థి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని.. తనను గెలిపించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి.. బీసీ నినాదంతో బీజేపీ అభ్యర్థి పోటీ పడుతూ.. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తంచేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.