HYD Letsvote Campaign: ‘లెట్స్ ఓట్ క్యాంపెయిన్‌’ ఓటు విలువ తెలుసుకో.. ఓటు వేసి నీ విలువ పెంచుకో..

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను గుర్తించి వినియోగించుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన లెట్స్ ఓట్ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ తెలంగాణ ఎన్నికల్లో పౌరులంతా ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సెమినార్లు, మారథాన్ లు వంటి వినూత్న కార్యక్రమాలతో యువ ఓటర్లను చైతన్య పరుస్తామని 'లెట్స్ ఓట్..' అంటూ నినదిస్తోంది..

HYD Letsvote Campaign: 'లెట్స్ ఓట్ క్యాంపెయిన్‌' ఓటు విలువ తెలుసుకో.. ఓటు వేసి నీ విలువ పెంచుకో..
Hyd Lets Vote Campaign
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Nov 21, 2023 | 11:15 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 21: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను గుర్తించి వినియోగించుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన లెట్స్ ఓట్ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ తెలంగాణ ఎన్నికల్లో పౌరులంతా ఓటు వేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సెమినార్లు, మారథాన్ లు వంటి వినూత్న కార్యక్రమాలతో యువ ఓటర్లను చైతన్య పరుస్తామని ‘లెట్స్ ఓట్..’ అంటూ నినదిస్తోంది.

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల రోజును ఓట్ల పండుగగా ఓటర్లంతా జరుపుకోవాలని ఎన్నికల సంఘం పిలుపుకు పలు స్వచ్ఛంద సంస్థలు తోడై జనాన్ని చైతన్య పరుస్తున్నాయి. నగరానికి చెందిన ‘లెట్స్ ఓట్..’ అనే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ 2008 నుంచి ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం గెలవాలంటే ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలన్న ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్తుంది. భౌతికంగా మారతాన్లు, సోషల్ మీడియాలో డిజిటల్ మారతాన్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడంతో పాటు కొత్త ఓటర్లు యువ ఓటర్లు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున చైతన్యం కల్పించేలా సెమినార్లు కండక్ట్ చేస్తున్నారు.

ఐటీ ప్రొఫెషనల్ డాక్టర్ జేఏ చౌదరి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వినియోగం ఎంతో అవసరమని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2008లో లెట్స్ ఓటు అనే సంస్థను ప్రారంభించారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో 15 ఏళ్లుగా లెట్స్ ఓట్ పేరుతో ఓటు విలువను అందరికీ తెలియజేస్తున్నామంట JA చౌదరి గర్వంగా చెబుతున్నారు. ఈ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ ద్వారా ఎంతో మంది యువతను 15 నెలలుగా ప్రభావితం చేస్తున్నామని ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఓటింగ్ శాతం తక్కువ ఉండడాన్ని గమనించి యువకులు ఐటీ ప్రొఫెషనల్ ఈ ప్రచారంలో ఎక్కువ భాగస్వామ్యం చేసి వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులను ఓటు వేసే దిశగా ప్రేరేపిస్తున్నామంటూ లెట్స్ ఓట్ కన్వీనర్ సుబ్బ రంగయ్య చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

లెట్స్ ఓట్‌ నిర్వహిస్తున్న సెమినార్స్ లో పెద్ద ఎత్తున పలువురు వ్యాపారవేత్తలు, ఐటీ కంపెనీల సీఈఓలు, ఎంటర్‌ప్రెన్యూర్‌లు పాల్గొని ఓటు విలువ గురించి యువ ఓటర్లకు వివరిస్తున్నారు. విదేశాల్లోని అనుభవాలు, దేశంలో ఓటు తీసుకొచ్చే ప్రజాస్వామ్య గొప్పతనాన్ని వివరిస్తూ.. ఓటు వేసి జీవితాన్ని మార్చుకోండని సూచిస్తున్నారు. లెట్స్ ఓట్ ప్రచారంలో పాల్గొన్న యువకులు, ట్రైనీలు, విద్యార్థులు తాము తొలిసారి ఓటు వేసేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నామని ఓటు విలువను తెలుసుకొని బ్యాలెట్ తో బుల్లెట్ లాంటి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు ఓటు వేసిన వారు రెండోసారి ఓటు వేసే సమయానికి ఎన్ని కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఓటు వేయాలన్న అవగాహన ఇలాంటి సంస్థల ప్రచార కార్యక్రమాల ద్వారా లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25న గచ్చిబౌలిలో ఐదు కిలోమీటర్ల మారతాన్ నిర్వహిస్తున్నామని, ఓటు హక్కు వినియోగాన్ని అందరికీ తెలియజేసేలా నిర్వహించే ఈ మారతాన్‌లో పెద్ద ఎత్తున యువకులు ఓటర్లు పాల్గొనాలని సంస్థ నిర్వాహకులు పిలుపునిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.