AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections 2023: ఎన్నికల వేళ ఏరులై పారుతోన్న నోట్ల కట్టలు.. ఆ డబ్బంతా అక్కడి నుంచే!

ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 659 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో పెద్ద మొత్తంలో నగదు బయటపడుతున్నాయి. విపరీతంగా నగదు దొరుకుతూ ఉండడంతో అధికారులు మూలాల పై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మేరకు నాయకులకు పార్టీ ఫండ్‌గా కేటాయిస్తోంది. ఆ ఫండ్ ను ప్రచారంలో ఉపయోగించుకోవచ్చు. కానీ పార్టీ ఇచ్చిన ఫండ్ మాత్రమే..

Telangana Elections 2023: ఎన్నికల వేళ ఏరులై పారుతోన్న నోట్ల కట్టలు.. ఆ డబ్బంతా అక్కడి నుంచే!
Money
Peddaprolu Jyothi
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 21, 2023 | 10:43 AM

Share

హైదరాబాద్, నవంబర్‌ 21: ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 659 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో పెద్ద మొత్తంలో నగదు బయటపడుతున్నాయి. విపరీతంగా నగదు దొరుకుతూ ఉండడంతో అధికారులు మూలాల పై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మేరకు నాయకులకు పార్టీ ఫండ్‌గా కేటాయిస్తోంది. ఆ ఫండ్ ను ప్రచారంలో ఉపయోగించుకోవచ్చు. కానీ పార్టీ ఇచ్చిన ఫండ్ మాత్రమే కాకుండా వివిధ సంస్థల నుంచి పోలీసులు, ఎన్నికల అధికారుల కంట పడకుండా నగదను బదిలీ చేస్తున్నారు ఆయా ఆయా పార్టీల నాయకులు…ప్రస్తుతం ఆ మూలాల పైనే ఫోకస్ పెట్టారు పోలీసులు, ఎన్నికల అధికారులు..

పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో నోట్ల కట్టలు విపరీతంగా పట్టుబడుతున్నాయి. నాయకుల పేర్లు బయట పడకుండా నగదు ను తమ నియోజకవర్గ ప్రజలకు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ ప్రయత్నాలలో భాగంగా మూలలపై దృష్టి పెట్టారు అధికారులు. నాయకులకు ఎవరి నుండి డబ్బులు వెళ్తున్నాయి? వాటిని ఓటర్ల వరకు ఎలా చేరవేస్తున్నారు అనే దానిపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ను ముందు ఉంచి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా నగదంత ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు యజమానులు.. నాయకులకు చేరవేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న సమాచారంతో వాటిపై ఫోకస్ పెట్టి పోలీసులు, ఎన్నికల అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో తాజాగా బాయినాబాద్ లో పట్టుబడిన 7 కోట్ల 50 లక్షల రూపాయలు శ్రీనిధి విద్యాసంస్థకు చెందిన చైర్మన్‌గా పోలీసులు గుర్తించారు.

అనంతరం ఆ డబ్బు తో సహా 9 మొబైల్ ఫోన్స్, 6 వాహనాలు, 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు,సరైన పత్రాలు చూపించకపోవడం తో నగదు సీజ్ చేశారు పోలీసులు అనంతరం ఆ నగదు ఎన్నికల అధికారులకు అందచేశారు.. మరోవైపు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వివేక్ వెంకటస్వామి కి సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అనే సంస్థకు లావాదేవీలు జరిగాయని సమాచారం రావడంతో సెంట్రల్ జోన్ పోలీసులు ఐటి మరియు ఈ డి ఎన్నికల అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ నెల 13న 8 కోట్ల రూపాయల నగదును ఫ్రిజ్ చెయ్యడం జరిగింది.

ఇవి కూడా చదవండి

ఎన్నికల పోలింగ్ సమయం లో పెద్ద మొత్తం లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండటం అనుమానాస్పదంగా భావించి అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. దింతో ఈడీ, ఐటీ రంగం లోకి దిగి వివేక్ వెంకటస్వామి ఇల్లు,కార్యాలయాలు,బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విదంగా నగదుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో నగదును సీజ్ చేసి ఫ్రిజ్ చేస్తున్నారు. ఈ విధంగా డైరెక్ట్ పార్టీ ఫండింగ్ తో కాకుండా వివిధ సంస్థల నుండి పెద్ద మొత్తంలో నగదును అనేక రూపాలలో బదిలీ చేస్తుండడంతో మూలాలపై అధికారులు ఫోకస్ పెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.