Telangana Elections: వ్యవసాయంపై ఎన్నికల ప్రభావం.. ఆగమవుతోన్న రైతులు.

ఎన్నికల ప్రచారాలు చూస్తుంటే.. 'ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్లుంది'. అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ప్రచారంలో హడావుడి కనబడాలని, రోజువారీగా కూలీలను వినియోగిస్తున్నారు. ఇంకేముంది... తాము ఎక్కడికి వెళ్లినా ధర్నాలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేసినా.. తమతో సుమారు వందమంది అనుచరులు ఉండేలా దీనసరి కూలీలను...

Telangana Elections: వ్యవసాయంపై ఎన్నికల ప్రభావం.. ఆగమవుతోన్న రైతులు.
Telangana Elections
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 22, 2023 | 11:51 AM

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన దగ్గర నుంచి అందరూ ఎదో ఒక రకంగా బిజీగా ఉంటున్నారు. మామూలు సమయాల్లో ఖాళీగా ఉన్నవారికి సైతం ఈ నెల రోజులు కాస్త ఏదొక పని దొరికిందని అనుకుంటున్నారు. ప్రచారంలో మంది మార్బలంతో హడావుడి చేసేందుకు నాయకులు జనాలను పోగు చేసుకుంటున్నారు. దీంతో ఈ ప్రభావం వ్యవసాయరంగంపై పడింది. వ్యవసాయానికి, ఎన్నికలకు మధ్య సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఎన్నికల ప్రచారాలు చూస్తుంటే.. ‘ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్లుంది’. అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ప్రచారంలో హడావుడి కనబడాలని, రోజువారీగా కూలీలను వినియోగిస్తున్నారు. ఇంకేముంది… తాము ఎక్కడికి వెళ్లినా ధర్నాలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేసినా.. తమతో సుమారు వందమంది అనుచరులు ఉండేలా దీనసరి కూలీలను నియమించుకుంటున్నారు. ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయి.

దీంతో దీపం ఉన్నప్పుడే సక్కపెట్టుకుందాం అని కొందరు… ఒకరి దగ్గర పనికి పోయే కంటే రాజకీయ నాయకుల ప్రచారాల్లో తిరిగితే డబ్బులకు డబ్బులు, సమయానికి భోజనం దొరుకుతుందని మరికొందరు.. పనిభారం తక్కువ, రోజులో కొద్ది సమయం వెచ్చిస్తే చాలు డబ్బులు వస్తాయని ఇంకొందరు.. నేతల పిలుపుకే జై కోడుతున్నారు. కొందరు నాయకులు అయితే నెలవారీగా జీతభత్యాలు చెల్లిస్తున్నారు. దీంతో దినసరి కూలీలు అందరూ ప్రచారానికి వెళ్తున్నారు.

ఇదిగో ఇదే.. వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. అందరూ ప్రచారబాట పడుతుండడంతో.. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పల్లెల్లో పట్టణాలలో చాలామంది దినసరి కూలీలు వ్యవసాయ పనులు .. అలాగే బిల్డింగ్ పనులు ఇతర పనులు మానుకొని నాయకుల వెంబడి ప్రచారానికి వెళ్తున్నారు. ఒక్కో కూలీకి దాదాపు రోజులు 500 రూపాయల వేతనం, పొద్దున టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ ఉండడంతో చాలా మంది ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు.

అయితే ఎన్నికల కారణంగా కోతకొచ్చిన పంటను కొసేందుకు కూలీలు దొరక్క ఆగం అవుతున్నారు రైతన్నలు. కూలీలు సరైన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పార్టీల కార్యకర్తలు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. కానీ ఇప్పుడు మాత్రం.. ఎక్కడ మీటింగ్‌లు, ర్యాలీలు, ధర్నాలు ఉన్న చోట కూలీలను వాడటంతో గ్రామాల్లో కూలీల కొరత, ఊర్లలో వ్యవసాయ పనులు కుంటుపడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!