Andhra Pradesh: పరిష్కారం చూపండి.. ఏపీ విభజన హామీలపై కేంద్ర హోంశాఖ సమీక్ష.. తెలుగు రాష్ట్రాల నుంచి..

ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై కేంద్ర హోం శాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ విభజన జరిగి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇంకా చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ గుర్తు చేస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

Andhra Pradesh: పరిష్కారం చూపండి.. ఏపీ విభజన హామీలపై కేంద్ర హోంశాఖ సమీక్ష.. తెలుగు రాష్ట్రాల నుంచి..
Telangana Andhra Pradesh
Follow us

|

Updated on: Nov 21, 2023 | 12:19 PM

ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని హామీల అమలుపై కేంద్ర హోం శాఖ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ విభజన జరిగి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇంకా చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ గుర్తు చేస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. తాజాగా ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరువుతున్నారు. ఏపీ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారులు హజరయ్యారు. తెలంగాణ నుంచి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.

ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశంలో 13వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలపై ప్రధాన చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతున్న సందర్భంలో ఏపీ అభిప్రాయాలు తెలిపేందుకు నిన్న సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోంశాఖ సమావేశంలో చెప్పాల్సిన విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పులు, అదాయం పంపిణీపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అయితే, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లవుతున్నా ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం దొరకలేదని.. విభజన హామీలు నెరవేర్చే బాధ్యత కేంద్రానిదే అంటూ ఏపీ సర్కారు పేర్కొంటోంది. అప్పులు, ఆదాయ కేటాయింపులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఏపీకి అప్పులు 58%, తెలంగాణకు 42%, ఏపీకి ఆదాయం 42% తెలంగాణకు 58%.. తమపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతున్న తరుణంలో ఈ సమావేశం కీలక కానుంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
మీ కంపెనీ మీ పీఎఫ్‌ నెలానెలా జమ చేస్తుందా? చెక్‌ చేయడం చాలా ఈజీ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
ఒక్కసారి రూ. లక్ష పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 4లక్షల వరకూ
బ్యాంకులో గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా?
బ్యాంకులో గోల్డ్ లోన్ కావాలంటే బంగారం కొన్న రశీదు చూపించాలా?
పొదుపు ఖాతాల్లో ఏడు శాతం వరకూ వడ్డీ.. ఆశ్చర్యంగా ఉందా?
పొదుపు ఖాతాల్లో ఏడు శాతం వరకూ వడ్డీ.. ఆశ్చర్యంగా ఉందా?
'కేజీఎఫ్ 3 స్టోరీ రెడీ..' ఎన్టీఆర్‏తో సినిమా పై నీల్ కామెంట్స్..
'కేజీఎఫ్ 3 స్టోరీ రెడీ..' ఎన్టీఆర్‏తో సినిమా పై నీల్ కామెంట్స్..
మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
నెలవారీ ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం.. ఉద్యోగులూ వదలొద్దు..
నెలవారీ ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం.. ఉద్యోగులూ వదలొద్దు..
టెస్లా కారుపై రోబో దాడి.. బుల్లెట్ల వర్షం.. చివరికి ఏమైందంటే..
టెస్లా కారుపై రోబో దాడి.. బుల్లెట్ల వర్షం.. చివరికి ఏమైందంటే..
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేసిన హైకోర్టు..
ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఫలితాల వెల్లడిపై స్టే ఎత్తివేసిన హైకోర్టు..
సీరియల్‌ బ్యాచ్‌కు భారీ షాక్‌.. ఆమె బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే
సీరియల్‌ బ్యాచ్‌కు భారీ షాక్‌.. ఆమె బ్యాగ్‌ సర్దుకోవాల్సిందే