Chandrababu: చంద్రబాబుకు బెయిల్‌పై అభ్యంతరం.. స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌లో అనేక ప్రశ్నలను లేవనెత్తింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా బెయిల్ ఎలా ఇస్తారంటోంది ఏపీ ప్రభుత్వం. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తోంది.
స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ కాగా, సెప్టెంబర్ 10నుంచి అక్టోబర్ 31వరకు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలతో అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. 20రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపైనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. చంద్రబాబు లాయర్లు వాదించని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎలా బెయిల్ ఇస్తారంటోంది. ట్రయల్ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం ఏంటనేది ఏపీ ప్రభుత్వం వాదన.
ఇదిలాఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై ఇవాళ విచారణ జరగనుంది. గతంలో ఈ కేసులో హైకోర్టు ఇవాళ్టివరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ విచారణపై సైతం స్టే కొనసాగుతోంది.
మద్యం కేసులో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.