AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఫిషింగ్ హార్బర్‌ ప్రమాద బాధితులకు అండగా ఉంటా.. ఆర్థిక సాయం అందించనున్న పవన్ కల్యాణ్..

Visakha Fishing Harbour Fire Accident Updates: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్‌ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. ప్రమాద స్థలం‌లో సాయంత్రం పార్టీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.

Pawan Kalyan: ఫిషింగ్ హార్బర్‌ ప్రమాద బాధితులకు అండగా ఉంటా.. ఆర్థిక సాయం అందించనున్న పవన్ కల్యాణ్..
Pawan Kalyan
Shaik Madar Saheb
|

Updated on: Nov 21, 2023 | 1:28 PM

Share

Visakha Fishing Harbour Fire Accident Updates: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్‌ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు.. ప్రమాద స్థలం‌లో సాయంత్రం పార్టీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. మొదట యూట్యూబర్ నానిపై అనుమానాలు వ్యక్తం కాగా.. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇతర కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాలపైనా విచారిస్తున్నారు. అయితే, హార్బర్‌ సమీపంలోనే పెట్రో నిల్వలు, ఈస్టర్న్ నేవీ, షిప్ బిల్డింగ్ యూనిట్స్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఉండడంతో భద్రతపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు నిందితులను గుర్తించలేదని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

అయితే, ఫిషింగ్ హార్బర్ లో భద్రత డోల్లతనంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 30కి పైగా సీసీ కెమెరాలు ఉన్నా పవర్ కట్ కారణంగా పనిచేయడం లేదని తేల్చారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడంలో ఆలస్యమవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. గతంలోనూ హార్బర్ కేంద్రంగా అనేక నేరాలు జరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా గతంలో పలు హత్యలు జరిగాయి. జెట్టిల్లో అనేకసార్లు మృతదేహాలు బయటపడ్డాయి. ఇదంతా గంజాయి బ్యాచ్ ఆగడాలంటూ మహిళలు, స్థానికులు పేర్కొంటున్నారు. చీకటి పడితే దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయని.. భద్రతా పెంచాలని అనేకమార్లు అధికారులకు నివేదించామని మత్స్యకార సంఘాలు పేర్కొంటున్నాయి. పోర్టు ఆధీనంలో ఉన్న ఫిషింగ్ హార్బర్.. భద్రతను పోర్టు గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ లో భద్రతపై ప్రభుత్వం సీరియస్ అయింది.. ఘటనపై నిఘా సంస్థల ఆరా నేపథ్యంలో ఇప్పటికే సీపీతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి భద్రతను పెంచాలని సూచించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో 25కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి. బాధిత మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మంటల్లో దగ్ధమైన 36 బోట్లకు 80శాతం మేర పరిహారం అందిస్తామన్నారు. నాలుగైదు రోజుల్లోనే ఈ ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది కృషి వల్ల ప్రాణనష్టం జరగలేదని, అధికారుల చర్యల వల్ల పక్కనున్న ఆయిల్‌ ట్యాంకర్‌కు మంటలు వ్యాపించలేదన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని.. నాలుగైదు రోజుల్లో పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అండగా ఉంటా.. పవన్ కల్యాణ్..

విశాఖ షిప్పింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధితులకు అండగా ఉంటానంటూ ప్రకటించారు. విశాఖ షిప్పింగ్ హార్బర్లో నష్టపోయిన బోట్ల యజమానులకు ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాలకు JSP తరుపున నుండి యాభై వేల రూపాయలు ఆర్దిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ బాధితులకు స్వయంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..