India vs Australia: భారత్‌పై ప్రపంచకప్‌ గెలిచిన తండ్రీ కొడుకులు.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలా..

మిచెల్ మార్ష్ క్రికెట్ ప్రపంచకప్‌లో ఘన విజయం సాధించాడు. 10 మ్యాచ్‌లలో మార్ష్ 107 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 49.00 సగటుతో 441 పరుగులు చేశాడు. అతను టోర్నమెంట్‌లో 177 అత్యుత్తమ స్కోరుతో రెండు సెంచరీలు, ఒక యాభై చేశాడు. అతను టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పదో స్కోరర్‌గా నిలిచాడు రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన జట్టు ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,

India vs Australia: భారత్‌పై ప్రపంచకప్‌ గెలిచిన తండ్రీ కొడుకులు.. క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి ఇలా..
Mitchell Marsh
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 21, 2023 | 6:16 PM

భారత్‌పై ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఘటన ఒకటి చోటు చేసుకుంది. అదోక యాదృచ్ఛిక సంఘటన. ఇది యావత్‌ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రపంచాన్ని గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మిచెల్‌ మార్ష్‌ కూడా ఆడాడు. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.. మార్ష్ తండ్రి జియోఫ్ మార్ష్ కూడా 1987 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున ఆడాడు. అతను ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. తండ్రి జెఫ్‌ మార్ష్‌ అడుగుజాడల్లోనే నడిచాడు మిచెల్‌ మార్ష్‌.

మిచెల్ మార్ష్ క్రికెట్ ప్రపంచకప్‌లో ఘన విజయం సాధించాడు. 10 మ్యాచ్‌లలో మార్ష్ 107 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 49.00 సగటుతో 441 పరుగులు చేశాడు. అతను టోర్నమెంట్‌లో 177 అత్యుత్తమ స్కోరుతో రెండు సెంచరీలు, ఒక యాభై చేశాడు. అతను టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన పదో స్కోరర్‌గా నిలిచాడు రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన జట్టు ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, 1987లో ఆసీస్‌తో స్వర్ణం సాధించిన తన తండ్రి, లెజెండరీ బ్యాటర్ జియోఫ్ మార్ష్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.  ఈసారి జియోఫ్ మార్ష్ కుమారుడు మిచెల్ మార్ష్ కూడా ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు అయ్యాడు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.  34 ఏళ్ల క్రితం మార్ష్‌ తండ్రి జెఫ్‌ మార్ష్‌ కూడా వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఆడాడు..అప్పుడే ఆస్ట్రేలియా తొలిసారిగా ప్రపంచ విజేతగా నిలిచింది. అప్పటి మ్యాచ్‌లో జియోఫ్‌ మార్ష్‌ కీలకంగా వ్యహరించాడు. ప్రపంచకప్‌-1987 టోర్నీలో మొత్తంగా 428 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక, జియోఫ్ మార్ష్, మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ చరిత్రలో ODI ప్రపంచ కప్ గెలిచిన మొదటి తండ్రీ కొడుకులుగా సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. మిచెల్ మార్ష్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్‌ చేశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో మార్ష్ స్టోరీ షేర్‌ చేశారు. అప్పుడు తన తండ్రితో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..